న్యూఢిల్లీలోని(New Delhi) వసంత్ విహార్‌లో జరుగుతున్న భారత రాష్ట్ర సమితి(BRS) నూతన కార్యాలయ(Party office) భవన నిర్మాణ పనులను రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashant reddy) బుధవారం పరిశీలించారు.

న్యూఢిల్లీలోని(New Delhi) వసంత్ విహార్‌లో జరుగుతున్న భారత రాష్ట్ర సమితి(BRS) నూతన కార్యాలయ(Party office) భవన నిర్మాణ పనులను రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) బుధవారం పరిశీలించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్కిటెక్ట్స్, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి భవనం చుట్టూ క‌లియ‌తిరిగి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు(KCR) నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ బృందాలను ఆయన కోరారు. న్యూఢిల్లీలోని వసంత్ విహార్‌లో 1,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టారు.

ఇదిఇలావుంటే.. మహారాష్ట్రలో ఈ నెల 24వ తేదీన జరుప‌త‌ల‌పెట్టిన‌ బీఆర్‌ఎస్ బహిరంగసభకు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. భద్రతా కారణాల వల్ల అంఖాస్ మైదానంలో ఎలాంటి సభలకు అనుమతి ఇవ్వడం లేదని.. ఈ సభకు కూడా అనుమతి ఇవ్వలేమని ఔరంగాబాద్ పోలీసులు తేల్చి చెప్పారు. సభ కోసం మరో ప్రదేశాన్ని ఎంచుకోవాలని బీఆర్‌ఎస్‌ నేతలకు సూచించారు.

Updated On 19 April 2023 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story