BRS Dasoju Shravankumar : ఓబీసీలపై బీజేపీ మొసలి కన్నీరు...దాసోజు శ్రవణ్ ఘాటు విమర్శలు
బీసీ ముఖ్యమంత్రి అనే బూటకపు నినాదంతో బీజేపీ(BJP) అగ్రనాయకుడు అమిత్ షా(Amit shah) ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు బీఆర్‌ఎస్(BRS) నేత దాసోజు శ్రవణ్‌కుమార్(Dasoju Shravankumar). తెలంగాణలో బీజేపీ ఎప్పుడో భూస్థాపితం అయ్యిందన్నారు. ఆ పార్టీకి జవసత్వాలను అందించేందుకు అమిత్‌షా విఫలయత్నాలు చేస్తున్నారని చెప్పారు.
బీసీ ముఖ్యమంత్రి అనే బూటకపు నినాదంతో బీజేపీ(BJP) అగ్రనాయకుడు అమిత్ షా(Amit shah) ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు బీఆర్‌ఎస్(BRS) నేత దాసోజు శ్రవణ్‌కుమార్(Dasoju Shravankumar). తెలంగాణలో బీజేపీ ఎప్పుడో భూస్థాపితం అయ్యిందన్నారు. ఆ పార్టీకి జవసత్వాలను అందించేందుకు అమిత్‌షా విఫలయత్నాలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీజేపీ కుట్రలు, ఓటర్లను మభ్యపెట్టే కుతంత్రాలను అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదని దాసోజు అన్నారు. బీజేపీకి ఓబీసీల పట్ల అంత సానుభూతి ఉంటే, రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బీసీ నాయకుడిని తొలగించి అగ్రవర్ణ నేతకు ఎందుకు ఆ పదవి ఇచ్చారో చెప్పాలన్నారు.
ఓబీసీల(OBC) రాజ్యాంగ హక్కులను హరిస్తూ, వారిని దారుణంగా బీజేపీ మోసం చేస్తున్నదని విమర్శించిన శ్రవణ్ బీసీ కులాల గణనను ఎందుకు నిర్వహించలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వంలో ఓబీసి మంత్రిత్వ శాఖ ఎందుకు లేదో, మీ ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్ల బిల్లును చట్టసభలో ఎందుకు ప్రవేశపెట్టలేదో చెప్పాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ ఓబీసి కమిషన్‌ను న్యాయపరమైన అధికారం లేకుండా దంతాలు లేని పులిలా పలుచన చేసి, బలహీన పర్చిందని చెప్పారు. తగిన నిధులు, అధికారం కేటాయించకుండా జాతీయ ఓబీసి కార్పొరేషన్‌ను మీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసిందో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, కేంద్రీయ సంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న వేలాది బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడంలో మీ ప్రభుత్వం ఎందుకు విఫలమైందో ప్రజలకు వివరించాలన్నారు. భారతదేశంలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్శిటీలలోని వివిధ రిక్రూట్‌మెంట్లలో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయని బీజేపీ ఇప్పుడు ఓబీసీలపై మొసలి కన్నీరు కారుస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా బీసీలని దారుణంగా అణచివేసిన బీజేపీ ఇప్పుడు తెలంగాణా ఓటర్లను మభ్యపెట్టాలని చూస్తున్న బూటకపు నినాదం పగటి కలగా మాత్రమే మిగిలిపోతుందని దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు.