సోదరి(Sister) ప్రేమ వ్యవహారం ఆమె అన్నకు(Brother) నచ్చలేదు. దీంతో చెల్లిని, అడ్డొచ్చిన తల్లిని చెరువులోకి(River) యువకుడు తోసేశాడు. కర్నాటకలోని(Karnataka) హన్సూర్‌(Hansur) తాలుకా మరూర్‌ గ్రామానికి చెందిన 19 ఏళ్ల ధనుశ్రీ(Dhanusri) ముస్లిం యువకుడిని ప్రేమిస్తోందని చెల్లిని మందలించేవాడు.

సోదరి(Sister) ప్రేమ వ్యవహారం ఆమె అన్నకు(Brother) నచ్చలేదు. దీంతో చెల్లిని, అడ్డొచ్చిన తల్లిని చెరువులోకి(River) యువకుడు తోసేశాడు. కర్నాటకలోని(Karnataka) హన్సూర్‌(Hansur) తాలుకా మరూర్‌ గ్రామానికి చెందిన 19 ఏళ్ల ధనుశ్రీ(Dhanusri) ముస్లిం యువకుడిని ప్రేమిస్తోందని చెల్లిని మందలించేవాడు. అతనితో ప్రేమాయణాన్ని మానుకోవాలని చెల్లితో ప్రతిరోజు గొడవపడేవాడు. తల్లిదండ్రులు ఇద్దరికీ సర్దిచెప్పేవారు. ఈ క్రమంలో మరోసారి ఈనెల 23న రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ముస్లిం వ్యక్తితో ప్రేమాయణాన్ని కొనసాగించకూడదని నితిన్‌(Nithin) తన చెల్లికి ఆదేశించాడు. అందుకు ధనుశ్రీ ఒప్పుకోలేదు. ఈ క్రమంలో బంధువుల ఇంటికి తల్లిని, చెల్లిని తీసుకెళ్తుండగా వాగ్వాదం చోటుచేసుకోవడంతో దారిలో ఉన్న చెరువు దగ్గర ఆపి చెల్లిని అందులోకి తోసేశాడు. దీంతో ఆమెను రక్షించేందుకు యువతి తల్లి అనిత ప్రయత్నించగా..ఆమె కూడా చెరువులో మునిగి చనిపోయింది. అనంతరం ఇంటికి వెళ్లిన నితిన్‌ తండ్రికి జరిగిన విషయాన్ని తెలిపాడు. అతడు వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. తల్లీకూతురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. నితిన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated On 25 Jan 2024 5:42 AM GMT
Ehatv

Ehatv

Next Story