Akshatha murthy : సెక్యూరిటీ లేకుండా బెంగళూరులో వీధుల్లో బ్రిటన్ ప్రథమ మహిళ...
ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి(Narayan Murthy), ఆయన సతీమణి సుధామూర్తి(Sudha murthy) కోట్లకు పడగలెత్తారు. అయినా సింపుల్ లైఫ్‌ను గడిపేస్తుంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్‌వేర్ సంస్థను నడుపుతున్నా సాదాసీదా జీవితాన్ని గడుపుతుంటారు. ఆడంబరాలకు ఆమడ దూరంలో ఉంటారు.

Akshatha murthy
ఇన్ఫోసిస్ సంస్థ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి(Narayan Murthy), ఆయన సతీమణి సుధామూర్తి(Sudha murthy) కోట్లకు పడగలెత్తారు. అయినా సింపుల్ లైఫ్‌ను గడిపేస్తుంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్‌వేర్ సంస్థను నడుపుతున్నా సాదాసీదా జీవితాన్ని గడుపుతుంటారు. ఆడంబరాలకు ఆమడ దూరంలో ఉంటారు. వీరి కూతురు అక్షత మూర్తి(Akshatha murthy) కూడా అంతే! ఓ దేశానికి ప్రథమ మహిళ అయినా ఆమె కూడా ఎంతో సింపుల్‌గా ఉంటారు. లేటెస్ట్‌గా అక్షత తన కుటుంబంతో కలిసి బెంగళూరు రోడ్లపై కనిపించింది. తండ్రి నారాయణమూర్తి, తల్లి సుధామూర్తి, ఇద్దరు కూతుళ్లు అనౌష్క, కృష్ణతో కలిసి బెంగళూరులో ఉన్న రాఘవేంద్ర మఠాన్ని సందర్శించారు. అయితే ఆ సమయంలో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సాధారణ పౌరుల్లాగే వీధులన్నీ తిరిగారు. వీరిని చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్(Rishi sunak) భార్య అక్షత మూర్తి, పిల్లలు బెంగళూరులోని రాఘవేంద్ర మఠం దగ్గర కనిపించారని, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఉన్నారని, ఇది వారి సింప్లిసిటీకి నిదర్శనమని రాసుకొచ్చారు. నెటిజన్లు అందరూ పొగిడేస్తున్నారు. అక్షత మూర్తి ఇటీవల తన తండ్రి నారాయణమూర్తితో కలిసి బెంగళూరులో ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లారు. కార్నర్ హౌజ్ హోటల్‌లో ఇద్దరూ ఐస్‌క్రీమ్ తిన్నారు. నవ్వుతూ ఫోటోలు దిగారు.
