Rishi Sunak : ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అపూర్వ ఘట్టం... సెనేటర్‌గా భగవద్గీతపై ప్రమాణం
బ్రిటన్(Britain) ప్రధానమంత్రిగా(Prime Minister) ఆ దేశ పార్లమెంట్‌లో రషి సునాక్(Rashi Sunak) భగవద్గీతపై(Bhagavad Gita) ప్రమాణం(Oath) చేయడాన్ని చూసి భారతీయులందరూ ఉప్పొంగిపోయారు. గర్వపడ్డారు కూడా! మనల్ని రెండువందల ఏళ్లకు పైగా పాలించిన తెల్లవారి దేశానికే మన భారత సంతతికి చెంది వ్యక్తి ప్రధానమంత్రి కావడం గర్వకారణమే కదా! ఇప్పుడు ఆస్ట్రేలియా(Australia) పార్లమెంట్‌లో కూడా మనమంతా గర్వపడే ఘటన జరిగింది.
బ్రిటన్(Britain) ప్రధానమంత్రిగా(Prime Minister) ఆ దేశ పార్లమెంట్‌లో రిషి సునాక్(Rishi Sunak) భగవద్గీతపై(Bhagavad Gita) ప్రమాణం(Oath) చేయడాన్ని చూసి భారతీయులందరూ ఉప్పొంగిపోయారు. గర్వపడ్డారు కూడా! మనల్ని రెండువందల ఏళ్లకు పైగా పాలించిన తెల్లవారి దేశానికే మన భారత సంతతికి చెంది వ్యక్తి ప్రధానమంత్రి కావడం గర్వకారణమే కదా! ఇప్పుడు ఆస్ట్రేలియా(Australia) పార్లమెంట్‌లో కూడా మనమంతా గర్వపడే ఘటన జరిగింది.
భారత సంతతికి చెందిన బారిస్టర్ వరుణ్ ఘోష్.. ఆస్ట్రేలియా పార్లమెంటు సాక్షిగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆస్ట్రేలియన్ పార్లమెంట్ చరిత్రలో ఇలా గీతపై ప్రమాణం చేయడం ఇదే ప్రథమం. ఆస్ట్రేలియన్ పార్లమెంటులో మన పవిత్ర గ్రంథంపై భారతీయ సంతతికి చెందిన సెనేటర్(MP) ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియన్ సెనేటర్‌గా చరిత్ర సృష్టించారు.లెజిస్టేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫెడరల్ పార్లమెంట్ సెనేట్‌లో పశ్చిమ ఆస్ట్రేలియాకి ప్రాతినిథ్యం వహించేందుకు వరుణ్ ఘోషను ఎంపిక చేశాయి. ఈ మేరకు ఆస్ట్రేలియన్ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ వరుణ్ ఘోష్‌కి స్వాగతం పలికారు. 'పశ్చిమ ఆస్ట్రేలియా సరికొత్త సెనెటర్ వరుణ్ ఘోష్‌కి స్వాగతం. సెనేటర్ భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియన్ సెనేటర్ మీరు. తొలిసారిగా ఓ వ్యక్తి సరికొత్త అధ్యయానికి తెరతీసినప్పుడూ అతనే చివరి వారు కాదని గుర్తుంచుకోవాలి. సెనేటర్ ఘోష్ పశ్చిమ ఆస్ట్రేలియన్ల బలమైన గొంతుకగా ఉంటారని నమ్ముతున్నా' అని ట్వీట్ చేశారు పెన్నీవాంగ్. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉంటున్న వరుణ్ ఘోష్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ అండ్ లాలో డిగ్రీ పొందాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో కామన్వెల్త్ స్కాలర్. ఇంతకు ముందు వాషింగ్టన్ డీసీలో ప్రపంచబ్యాంకు సలహాదారుగా, న్యూయార్క్ ఫైనాన్స్ అటార్నీగా పని చేశారు. లేబర్‌పార్టీలో చేరికతో ఆయన రాజకీయ జీవితం మొదలయ్యింది.