ఇక నుంచి బ్రిటన్‌లో(Britain) చదువుకోవాలనుకునే భారతీయులకు(Indians) కాస్త ఇబ్బందే! ఎందుకంటే యూకే(UK) వెళ్లాలనుకునే విద్యార్థులకు(Students) కొత్త నిబంధనలను తీసుకొస్తున్నారు. స్థానికులకు విద్య(Education), ఉద్యోగ(Job), ఉపాధి అవకాశాలలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి ఇమ్మిగ్రేషన్‌ను తగ్గించడానికి బ్రిటన్‌ ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం రాడికల్‌ యాక్షన్‌(Radical Action) ప్రకటించింది.

ఇక నుంచి బ్రిటన్‌లో(Britain) చదువుకోవాలనుకునే భారతీయులకు(Indians) కాస్త ఇబ్బందే! ఎందుకంటే యూకే(UK) వెళ్లాలనుకునే విద్యార్థులకు(Students) కొత్త నిబంధనలను తీసుకొస్తున్నారు. స్థానికులకు విద్య(Education), ఉద్యోగ(Job), ఉపాధి అవకాశాలలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి ఇమ్మిగ్రేషన్‌ను తగ్గించడానికి బ్రిటన్‌ ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం రాడికల్‌ యాక్షన్‌(Radical Action) ప్రకటించింది. నైపుణ్యం కలిగిన విదేశీయుడు బ్రిటన్‌లో పని చేయడానికి వీసా కావాలనుకుంటే కనీస వేతనాన్ని కూడా భారీగా పెంచింది. 2022లో ప్రభుత్వం జారీ చేసిన వీసాల సంఖ్య 7,45,000. బ్రిటన్‌ చరిత్రలో ఇంతటి భారీ సంఖ్య ఎప్పుడూ లేదు. అంచేత పెరిగిన ఇమ్మిగ్రేషన్ వీసాల సఖ్యను మూడు లక్షల కంటేతక్కువగా తీసుకురావాలనుకుంటోంది ప్రభుత్వం. కొత్త రాకపోకలను తగ్గిస్తానని ప్రతిజ్క్ష చేసిన బ్రిటన్‌ ప్రధాని రుషి సునాక్‌(Rushi Sunak)పై ఒత్తిడి పెరగడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అత్యధిక వేతనాలు ఉన్న విదేశీ వృత్తి నిపుణులకే వీసాలు ఇవ్వాలని నిర్ణయించిది. విదేశీ విద్యార్థులు తమ కుటుంబసభ్యులను బ్రిటన్‌కు తీసుకురావడంపై కూడా బ్రిటన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. డిపెండెంట్లుగా వచ్చే భాగస్వాములకు కఠిన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. బ్రిటన్‌లో వృత్తి నిపుణుల వీసా పొందడానికి గతంలో ఏడాదికి 26,200 పౌండ్ల వేతనం ఉంటే చాలు. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఆ జీతం 38,700 పౌండ్లు ఉండాలి. గతంలో కుటుంబ వీసా కోసం 18,600 పౌండ్ల వేతనం ఉంటే సరిపోయేది. దానినీ 38,700 పౌండ్లకు ప్రభుత్వం సవరించింది. గతంలో బ్రిటన్‌కు యూరోపియన్‌ యూనియన్‌ దేశాల వారు ఎక్కువగా వచ్చేవారు. కానీ ఇటీవల ఇండియా, నైజీరియా, చైనా నుంచి ఎక్కువ సంఖ్యలో వెళుతున్నారు. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఈ సంఖ్య భారీగా తగ్గుతుంది.

Updated On 5 Dec 2023 7:52 AM GMT
Ehatv

Ehatv

Next Story