ఓ వ్యక్తి అక్టోబరు 27న కనిపించకుండా(Missing) పోయాడు. కుటుంబసభ్యులు పదే పదే కోరడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓ వ్యక్తి అక్టోబరు 27న కనిపించకుండా(Missing) పోయాడు. కుటుంబసభ్యులు పదే పదే కోరడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నవంబర్ 10న సబర్మతి నదిలో ఓ మృతదేహాన్ని(Deadbody) గుర్తించేందుకు కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. బంధువులు వచ్చి అతడిని 43 ఏళ్ల బ్రిజేష్ సుతార్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని విజాపూర్(Vijapur), మెహసానాలోని వారి స్వగ్రామానికి అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు. నవంబర్ 14న సంతాప సభ 'స్థానికంగా బెస్నా(Besna) అని పిలుస్తారు నిర్వహించారు'. ఒక రోజు తర్వాత సుతార్ మళ్లీ తిరిగి రావడం చూసి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు ఆశ్చర్యపోయారు. సజీవంగా. మృతదేహం తన కొడుకులా ఉందని..మృతదేహాన్ని గుర్తించడం కోసం వెళ్లిన తన అల్లుడు, పోలీసుల పొరపాటు పడ్డారని సుతార్ తల్లి తెలిపింది. షేర్ మార్కెట్‌లో భారీగా నష్టం రావడంతో ఒత్తిడితో సుతార్ ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వీరు దహనం చేసిన మృతదేహం ఎవరిది అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.