అది అతి పెద్ద శైవక్షేత్రం.. భక్తులు నిత్యం పూజించుకునే పుణ్యక్షేత్రం.. ఎత్తైనా.. వింతైన శిల్పకళా నైపుణ్యం.. శాస్త్రావేత్తలకే అంతుపట్టని 13 అంతస్తుల ఏక శిలా ఆలయం(single rock temple).. అవును నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా.. 13 అంతస్థుల ఏక శిలా ఆలయం అంది. ఇలా ఎన్నో విశేషాలున్న ఆలయం ఎక్కడుందో తెలుసా..? ఆ గుడిలో ఆశ్యర్యపరిచే వింతలు విశేషాలు ఏమున్నాయి.. తెలుసుకుందాం..

అది అతి పెద్ద శైవక్షేత్రం.. భక్తులు నిత్యం పూజించుకునే పుణ్యక్షేత్రం.. ఎత్తైనా.. వింతైన శిల్పకళా నైపుణ్యం.. శాస్త్రావేత్తలకే అంతుపట్టని 13 అంతస్తుల ఏక శిలా ఆలయం(single rock temple).. అవును నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా.. 13 అంతస్థుల ఏక శిలా ఆలయం అంది. ఇలా ఎన్నో విశేషాలున్న ఆలయం ఎక్కడుందో తెలుసా..? ఆ గుడిలో ఆశ్యర్యపరిచే వింతలు విశేషాలు ఏమున్నాయి.. తెలుసుకుందాం..

భారతదేశంలో వేయి సంవత్సరాల నాటి దేవాలయం ఒకటి ఉంది.. ఇంత పెద్ద గుడి ఇండియాలో ఇంకా ఎక్కడా లేదు. అంతే కాదు మన దేశంలో అతి పెద్ద శివలింగం(Shiva lingam) కూడా ఇక్కడే ఉంది. ఇండియాలోనే ఉంది.. కాని అది ఎక్కడుంది..? ఆ గుడివిశేషాలేంటి.. ? అది తంజావూరులో(Thanjavur) ఉంది. తమిళనాడు(Tamilnadu) రాష్ట్రంలోని తంజావూరు బృహదీశ్వరాలయం ఎన్నో వింతలకు నిలయం. అవును అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టరీ.. ప్రతీ అడుగు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తంజావూరు గురించి వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది. అంతటి విశేషం ఉన్న ఈ బ్రుహదీశ్వరాయలాయిన్ని(Brihadeshwaralayam) సిమెంట్ అన్న మాట లేకుండా ఏక శిలపై చెక్కారు. ఇంత పెద్ద ఆలయం..అది కూడా ఏక శిలపై చెక్కడం ఎలా సాధ్యం అని మీకు అనిపించబచ్చు.. అదే కదా.. మన పూర్వీకుల గొప్పతనం

ఇనుము.. ఉక్కు స్టీల్(Steel) అన్నది లేకుండా వాడకుండా.. ఏక శిలతో కట్టిన ఈ గుడిని చూస్తే ఆనాటి టెక్నాలజీ ఇంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది. ఆ కాలంలోనే ఇంజనీరింగ్ టెక్నాలజీ ఈరంగా ఉపయోగించారా అని మీరు నోటిమీద వేలు వేసుకునే విధంగా ఆశ్చర్యపరుస్తుంది. ఈ అద్భుతం ఎలా సాధ్యం అయ్యింది. తంజావురు దేవాలయాని ఇలా ఎలా ఏక విలపై కట్టగలిగారు...? దాదాపు వేయి సంవత్సరాల క్రితం కట్టిన ఈ గుడి. 13 అంతస్థులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం. భారతదేశంలో అతి పెద్ద శివలింగం ఉన్న క్షేత్రం.

దక్షిణ కాశీగా(South Kasi) పేరొందిన ఈ గుడిలో ఎన్నో మిస్టరీ వింతలు దాగి ఉన్నాయి. ఇక్కడి శివలింగం ఎత్తు 3.7 మీటర్లు . అంతే కాదు ఈ శివలింగానికి ఏమాత్రం తగ్గకుండా అతి పెద్ద నంది విగ్రహాన్ని అక్కడ నిర్మించారు. ఈ విగ్రహం దాదాపు 20 టన్నుల బరువు కలిగి..ఆశ్చర్యకరంగా ఏకశిలాపై చెక్కి ఉంటుంది. 2 మీటర్ల ఎత్తు ,2.6 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది.

ఈ తంజావూరు ఆలయానికి ఇతర పదార్ధాలే ఏవీ వాడలేదు. పూర్తిగా గ్రానైట్ రాయితో కట్టబడింది. 13 అంతస్థులు గ్రానెట్ రాయితోనే కట్టారు. 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం అసలునమ్మశక్యంకాని నిజం. ఎటువంటి వాలు లేకుండా అంత ఎత్తున ఇంత బరువున్న గోపురాన్ని ఎలా నిలబెట్టారు అన్నది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది.

ఇక ఇక్కడ మరో విచిత్రం ఏంమిటంటే... మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ గోపురం నీడ(Shadow) ఎక్కడా పడదు. గుడి నీడ కనపడినా గోపురం నీడ మాత్రం చూడలేము. ఇలాంటి ఆర్కిటెక్చర్ ను ఇంత వరకూ ఎక్కడా చూడలేదు.. అసలు ఏ టెక్నిక్ వాడి వారు ఇలా చేశారో ఎవరూ కనిపెట్టలేకపోయారు.. 80 టన్నుల బరువున్న ఆ కలశాన్ని అక్కడికీ తీసుకెళ్లటమనేది కూడా పెద్ద మిస్టరీనే.. అది ఎలా సాధ్యం అయ్యింది.. ఎలా చేయగలిగారో ఎవరికీ తెలియదు.. ఇది ఆనాటి వేద-శాస్త్రజ్ఞులు, రాజుల నైపుణ్యానికి ప్రతీక.

ఈ ఆలయంలో మరోవింత శబ్ధ పరిజ్ఞానం. పర్లాంగు దూరం ఉండే ఈ ప్రాంగణంలో.. మనం ఏ మాట మాట్లాడుకున్నా అవి మళ్ళీ కొంచెం కూడా ప్రతిధ్వానించవు..అంతటి శబ్ద పరిజ్ఙానంతో ఈ గుడిని కట్టారు. ఇక ఈ ఆలయం లోపల ఉండే సొరంగ మార్గాలు కూడా మిస్టరీనే... ఇవి కొన్ని తంజావూరులో ఉన్న కొన్ని పురాతన ఆలయాలకు దారితీస్తాయని వినికిడి.. కాని మరి కొన్ని మాత్రం మరణానికి దారి తీసే భయంకర మైన బిళాలు కలిగి ఉన్నాయని చెపుతుంటారు.. అందుకే వాటి దారులు కూడా మూసివేశారు.

ఈ గుడిలో రాతి తోరణాలు.. దాని 6 మిల్లీ మీటర్లకన్నా చిన్నగా ఉన్న రంద్రాలు వారు ఆకాలంలో ఎలా పెట్టారు అనేది ఇప్పటికి అంతుచిక్కని విషయమే. అవి కూడా స్ట్రైయిట్ గా ఉండవు.. వంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం ఇప్పటి టెక్నాలజీకి అంతుపట్టని విషయం. అవి అలా ఎందుకు పెట్టారో ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేక పోయారు. అసలు ఎలా పెట్టారో కూడా తెలుసుకోలేకపోయారు ఇప్పటి వరకూ.

ఇక శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఈ తంజావూరు బృహదీశ్వరాయలయం మిస్టరీని చేధించలేకపోయారు.. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది. ప్రపంచంలో ఎక్కడైనా.. వేయి సంవత్సరాల గుడులు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి. కాని ఈ గుడి మాత్రం నిత్య ధూప,దీప నైవేధ్యాలు, హారతులతోవెలుగు వెలుగుతోంది.

Updated On 27 Nov 2023 8:15 AM GMT
Ehatv

Ehatv

Next Story