ఓ వధువు(Bride) తన పెళ్లి కోసం అందంగా ముస్తాబైంది. పెళ్లి కోసం మ్యారేజ్‌హాల్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. వధువును మ్యారేజ్‌ హాల్‌కు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు, బంధువులందరూ కలిసి తమ కార్లలో బయల్దేరారు.

ఓ వధువు(Bride) తన పెళ్లి కోసం అందంగా ముస్తాబైంది. పెళ్లి కోసం మ్యారేజ్‌హాల్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. వధువును మ్యారేజ్‌ హాల్‌కు తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు, బంధువులందరూ కలిసి తమ కార్లలో బయల్దేరారు. ఈరోజుల్లో ట్రాఫిక్‌ ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎందుకు జాం అవుతుందో తెలియదు కదా. ట్రాఫిక్‌లో(Traffic) పెళ్లి కూతురు ఇరుక్కుపోయింది. దీందో కారును అక్కడే వదిలేసిన పెళ్లి కూతురు మెట్రోను(Metro) ఆశ్రయించింది. బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.

అసలే ట్రాఫిక్‌ జాంలకు మారుపేరైన బెంగళూరులో(Bangalore) ఇలాంటివి తరుచుగా చోటుచేసుకుంటాయి. తాజాగా బెంగళూరులో ఓ పెళ్లికూతురికి ట్రాఫిక్‌ జాం నరకం చూపింది. కాసేపట్లో పెళ్లి ఉందనగా మ్యారేజ్‌హాల్‌కు వెళ్లే సమయంలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. దీంతో చేసేదేమీ లేక.. పెళ్లికూతురు, ఆమె బంధువులంతా కలిసి మెట్రోలో వెళ్లారు. పెళ్లికూతురుగా తయారై మెట్రో ఎక్కడంతో ప్రయాణికులంతా నోరు వెళ్లబెట్టారు. ఏం జరిగిందని ఆరాతీయగా.. ట్రాఫిక్‌ జాం వల్ల మ్యారేజ్‌ హాల్‌కు చేరుకోలేకపోయానని.. అందుకే మెట్రో ఎక్కామని ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లి కూతురుకు ప్రయాణికులంతా అడ్వాన్స్‌ మ్యారేజ్‌ విషెస్‌ చెప్పడమే కాకుండా ఆమెతో సెల్ఫీలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బెంగళూరులోనే కాకుండా సోషల్ మీడియా ప్రపంచంలో చక్కర్లు కొడుతోంది.

Updated On 27 Jan 2024 1:39 AM GMT
Ehatv

Ehatv

Next Story