వారిద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి (Marriage) పెద్దలను ఒప్పించారు. షరతుల ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించున్నారు. తమ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి జరగాలని వధువు (Bride)ను తన ఇంటికి వరుడు (Bride Groom) తీసుకెళ్లాడు. ఇంతలోనే వరుడి ఇంట్లో పెళ్లికూతురు శవమై (Dead) కనిపించింది. కర్నాటకలోని టీబీడ్యాంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని టీబీ డ్యాం (TB Dyam) వాసులు ఐశ్వర్య (Aishwarya), అశోక్‌ (Ashok) గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరయినప్పటికీ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. తమ ఇంటి సాంప్రదాయం ప్రకారం పెళ్లాడుదామని ఐశ్వర్యను వరుడు తీసుకెళ్లాడు. అయితే ఈ పెళ్లికి యువతి తరపు నుంచి ఎవరూ రావొద్దని షరతు విధించారు. పెళ్లికి ఇంక మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. అన్ని ఏర్పాట్లు చేసుకొని పెళ్లికి సిద్ధపడుతుండగా.. వరుడి ఇంట్లో ఐశ్వర్య విగత జీవిగా కనిపించారు. ఈ విషయాన్ని ఐశ్వర్య తల్లిదండ్రులకు వరుడు తల్లిదండ్రులు ఫోన్‌ చేసి చెప్పగా.. తీవ్ర విషాదంలో ఐశ్వర్య కుటుంబం మునిగిపోయింది. అయితే తన కూతురు వెంట తమను రానివ్వకుండా అడ్డుకొని, ఇంటికి తీసుకెళ్లి హత్య (Murder) చేశారని ఐశ్వర్య తండ్రి ఆరోపిస్తున్నారు.

ఇది ముమ్మాటికీ హత్యేనని తండ్రి సుబ్రమణి అన్నారు. ఎంత మొత్తుకున్నా అశోక్‌నే పెళ్లి చేసుకుంటానని తన కూతురు పట్టుబట్టిందని, వారితో పొసగకున్నా కూతురు సంతోష కోసం పెళ్లికి ఒప్పుకున్నామన్నారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తండ్రి సుబ్రమణి చెప్తున్నారు. పెళ్లి వద్దని వారించినా, కూతురు, బంధువులు ఒప్పుకోలేదు, ఈనెల 15న అమ్మమ్మ ఇంట్లో పూజలు చేయడానికి పంపించాం. ఈనెల 16న అశోక్‌ నా కూతుర్ని వాళ్లింటికి తీసుకెళ్లాడు. సడన్‌గా సోమవారం ఫోన్‌ (Call) చేసి మీ కూతురు చనిపోయిందని చెప్పారని రోదించాడు. వరుడి కుటంబమే హత్య చేసిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు (Police) కేసు నమోదు చేసుకొని వరుడు అశోక్‌ను అరెస్ట్ చేశారు. ఐశ్వర్య మృతిపై విచారణ (Enquiry) చేపట్టారు.

Updated On 21 Nov 2023 5:58 AM GMT
Ehatv

Ehatv

Next Story