ఓ యువతి ప్రేమలో(Love) పడింది. ప్రియుడికి అన్ని విధాలా దగ్గరైంది. విషయంలో ఇంట్లో తెలియడంతో యువతిని స్వగ్రామానికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అక్కడ మరో యువకుడితో పెళ్లి జరపాలని నిశ్చయించారు. వివాహానికి(Marriage) అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరికొద్దిసేపట్లో పెళ్లి ఉందనగా బ్యూటీపార్లర్‌కని(Beauty Parlour) వెళ్లి ప్రియుడితో పెళ్లి కూతురు లేచిపోయింది. ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఓ కుటుంబం 25 ఏళ్ల క్రితం లక్నోకు(Lucknow) వచ్చి స్థిరపడింది. ఆ కుటుంబంలో ఉన్న యువతి ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. యువతిని స్వగ్రామం ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని(Kanpur) చౌబేపూర్‌ గ్రామానికి తీసుకెళ్లారు. తమ కులానికి చెందిన వ్యక్తితో పెళ్లికి నిశ్చయించారు. అయితే సదరు యువతి తన ప్రియుడితో(Lover) టచ్‌లోనే ఉంది. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ అతనికి చేరవేస్తూనే ఉంది. ఇద్దరూ కలిసి జంప్‌(Jump) అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇష్టంలేని పెళ్లి కుదర్చడంతో అతనితో వెళ్లేందుకు ఆమె సిద్ధపడింది. అందుకు పెళ్లి రోజునే లేచిపోవాలని ప్లాన్ వేశారు. పెళ్లికి కొద్ది ముందు బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. అప్పటికే బ్యూటీ పార్లర్‌ దగ్గర ఉన్న ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో అక్కడ ఉన్న స్నేహితులకు(Friends) కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.

ఇక కాసేపట్లో తన పెళ్లి కల నెరవేరబోతుందన్న ఉత్సాహంలో ఉన్న పెళ్లికొడుకు(Groom), అతని బంధువులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. పెళ్లి కూతురు గురించి ఆరా తీయగా తొలుత ఆమె తల్లిదండ్రులు దాట వేశారు. బ్యూటీపార్లర్‌కు వెళ్లిందని.. తిరిగి వస్తుందని చెప్పారు. పెళ్లి కూతురు ఎంతకూ తిరిగిరాకపోవడంతో పెళ్లి కొడుకు బంధువులు గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు పొక్కింది. దీంతో వరుడు బంధువులు ఆమె తల్లిదండ్రులపై ఆగ్రహం(Angry) వ్యక్తం చేశారు. ఇదివరకే ప్రేమ వ్యవహారం నడిపిన ఆ యువతిని తమ కుమారుడికి ఎలా కట్టబెడదామనుకున్నారని ప్రశ్నించారు. చేసేదేమీలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు పెళ్లి కూతురు జంప్‌ కావడంతో ఆమె కుటుంబంలో షాక్‌లోకి వెళ్లింది. జరిగిన తతంగమంతా పోలీసులకు(Police) చెప్పారు.

Updated On 2 Feb 2024 5:38 AM GMT
Ehatv

Ehatv

Next Story