అదేమిటో కానీ చిత్రవిచిత్రాలన్నీ ఉత్తరప్రదేశ్‌లోనే(Uttar Pradesh) జరుగుతుంటాయి. తాజాగా లక్నోలో(Lucknow) ఓ సంఘటన జరిగింది. పెళ్లికొడుకు(Groom) కాసింత తొందరపడటంతో వివాహవేదిక కాస్తా రణరంగస్థలిగా మారింది. అసలేం జరిగిందంటే హాపూర్‌లోని(Hapur) అశోక్‌నగర్‌లో(Ashok nagar) ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లు వివాహాలను ఒకే రోజు ఏర్పాటు చేశాడు. మొదట పెద్దమ్మాయి పెళ్లి అయ్యింది.

Uttar Pradesh
అదేమిటో కానీ చిత్రవిచిత్రాలన్నీ ఉత్తరప్రదేశ్‌లోనే(Uttar Pradesh) జరుగుతుంటాయి. తాజాగా లక్నోలో(Lucknow) ఓ సంఘటన జరిగింది. పెళ్లికొడుకు(Groom) కాసింత తొందరపడటంతో వివాహవేదిక కాస్తా రణరంగస్థలిగా మారింది. అసలేం జరిగిందంటే హాపూర్‌లోని(Hapur) అశోక్‌నగర్‌లో(Ashok nagar) ఓ వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లు వివాహాలను ఒకే రోజు ఏర్పాటు చేశాడు. మొదట పెద్దమ్మాయి పెళ్లి అయ్యింది. కాసేపటికి చిన్నమ్మాయి పెళ్లి తంతు మొదలయ్యింది. వధూవరులిద్దరూ దండలు మార్చుకున్నారు. ఆ సమయంలో వరుడు అత్యాత్సాహాన్ని ప్రదర్శిస్తూ వధువును అందరిముందూ ముద్దు(Kiss) పెట్టుకున్నాడు. ఇది ఆమె బంధువులకు నచ్చలేదు. వారు స్టేజిపైకి వచ్చి వరుడు, అతడి కుటుంబసభ్యులపై దాడికి దిగారు. వరుడు తరఫు వారు గమ్మున ఉండరు కదా! వారు కూడా చేయి చేసుకున్నారు. ఇలా పరస్పరదాడులతో పెళ్లి వేదిక యుద్ధరంగంగా మారిపోయింది. ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కొట్లాట ఆపగలిగారు. గాయపడిన ఏడుగురిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. తమ కూతురు వద్దు వద్దంటున్నా పెళ్లి కొడుకు అందరిముందు ముద్దు పెట్టుకున్నాడని వధువు తల్లిదండ్రులు ఆరోపించారు. మరోవైపు ఆమె అంగీకారంతోనే ముద్దు పెట్టుకున్నానని వరుడు చెబుతున్నారు. గొడవ అయితే జరిగింది కానీ తమకు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే బహిరంగంగా దాడికి పాల్పడినందుకు ఆరుగురిపై కేసు నమోదు చేశామన్నారు పోలీసులు.
