ఎలక్షన్స్(politics) లో ఏ పార్టీ అయినా.. సిమిమా గ్లామర్ కచక్చితంగా ఉంటుంది. సినిమాలు పార్టీలో చేరమో.. ప్రచారం చేయడమో.. ఏదో ఒకటి జరుగుతుంది. తాజాగా మన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. కాని ఇక్కడ కాదు.

ఎలక్షన్స్(politics) లో ఏ పార్టీ అయినా.. సిమిమా గ్లామర్ కచక్చితంగా ఉంటుంది. సినిమాలు పార్టీలో చేరమో.. ప్రచారం చేయడమో.. ఏదో ఒకటి జరుగుతుంది. తాజాగా మన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. కాని ఇక్కడ కాదు.

ఫిల్మ్ ఇండస్ట్రీ, పాలిటిక్స్.. ఈరెండ్ దాదాపు ఒక్కటే. ఎంతో మంది ఫిల్మ్ స్టార్స్ రాజకీయాల్లో రాణించారు.. మంత్రులు, ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా అయ్యారు. తెలుగులో ఎన్టీఆర్(NTR) నుంచి చిరంజీవి(chiranjevvi) వరకూ.. తమిళ్ లో ఎమ్జీఆర్(MGR) నుంచి స్టాలిన్(Stalin) తనయుడు ఉదయనిధి(Udayanidhi) వరకూ.. అంతా రాజకీయాలు, సినిమాలు రెండు రంగాలు చూసిన వారే. ఉత్తరాధిన కూడా స్టార్స్ ఎందరో రాజకీయల్లో ఉన్నారు.

ఇక ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలక్షన్స్ కు సినీ తారల ప్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. వారి గ్లామర్ ను ఇమేజ్ ను ఎలక్షన్స్ కోసం బాగా వాడుకుంటారు పొలిటీషియన్స్. తాజాగా మన తెలుగు స్టార్ కమెడియన్ .. బ్రహ్మనందం(Brahmanandam) కూడా తన పొలిటికల్ ఇన్నింన్స్ ను స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ కాదు.. పక్కరాష్ట్రంలో.. కర్ణటకలో ఎన్నికల వేడి గట్టిగా తగులుతుంది. ఈక్రమంలో.. అక్కడ తెలుగువారు ఎక్కువగా ఉండే.. చిక్కబళ్లాపూర్ లో(Chikkaballapur) ప్రాచారం చేస్తున్నారు.

అయితే అనూహ్యంగా బ్రహ్మానందం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మాజీ కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ తరఫున బ్రహ్మానందం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కే సుధాకర్ చిక్కబళ్లాపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం ఆ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గురువారం ప్రచారం నిర్వహించారు. బ్రహ్మానందం వస్తున్నారని తెలిసి.. జనం భారీగా తరలి వచ్చారు. ఆయన్ను ఫోటో తీసుకోవడం కోసం ఎగబడ్డారు.

ఈ క్రమంలో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. సుధాకర్‌ను గెలిపించాలని కోరారు.. తాను హైదరాబాద్ నుంచి ఇక్కడకి వచ్చానని.. ఆయన ఎంతమంచివాడో మనందరికీ తెలుసునని.. కావున ఆయనను తప్పకుండా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అలాగే.. అలా మాట్లాడుతూనే.. మధ్యలో జోక్స్ కూడా వేశారు బ్రహ్మానందం. ఏయ్ గేమ్స్ ఆడొద్దు.. శాల్తీలు లేచిపోతాయి.. అంటూ మాస్ డైలాగ్స్ తో జనాలను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న ఫోటోలు.. వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Updated On 4 May 2023 11:59 PM GMT
Ehatv

Ehatv

Next Story