ఓ యువతిని తన బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి విహారయాత్రలకు తీసుకెళ్లాడు.

ఓ యువతిని తన బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి విహారయాత్రలకు తీసుకెళ్లాడు. తనతో 'సన్నిహితంగా' మెలిగిన సమయంలో ఆమె తెలియకుండా రికార్డులు చేశాడు. పెళ్లికి నిరాకరించడమే కాకుండా ఆ వీడియోలు బయటపెడతానని బెదిరించి అందినకాడికి దండుకున్నాడు. బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు(Bengaluru)కు చెందిన 22 ఏళ్ల మోహన్‌కుమార్ అనే వ్యక్తి.. తన ప్రియురాలిని బ్లాక్‌మెయిల్ చేసి, లగ్జరీ కారు, విలువైన వస్తువులతో పాటు రూ.2.5 కోట్లు వసూలు చేశాడు. తన ఆర్థిక డిమాండ్లను నెరవేర్చకపోతే వీడియోలు, ఫోటోలను బహిర్గతం చేస్తానని కుమార్ యువతిని బెదిరించసాగాడు. స్కూల్ రోజుల నుంచి ఇద్దరు ఒకరినొకరు తెలుసు. గ్రాడ్యుయేషన్ తర్వాత గ్యాప్ వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత డేటింగ్ ప్రారంభించారు. యువతిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెను కలిసి విహారయాత్రలకు వెళ్లాడు. ఈ పర్యటనల సమయంలో అతను రహస్యంగా ఆమెతో సన్నిహిత క్షణాలను చిత్రీకరించాడు, రికార్డింగ్‌లను ప్రైవేట్‌గా ఉంచుతానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత విశ్వ రూపం ప్రదర్శించసాగాడు. నిత్యం బెదిరింపులు రావడంతో ఆ మహిళ బెంగళూరు పోలీసులకు మోహన్ కుమార్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.
