ఈ మధ్య పనివాళ్లు తెగ రెచ్చిపోతున్నారు..వాళ్లను పొరపాటున ఒక్క మాట అన్న కూడా పడటం లేదు ..పైగా పగ పెంచుకుంటున్నారు. వారి పనితీరు నచ్చక పనిలోంచి తీసేసిన ద్వేషంతో రగిలిపోతారు. ఒకవేళ పనిలో చేసేటప్పుడు చివాట్లు పెట్టిన వారిపై పగలు పెంచుకుంటారు. ఆ తర్వాత క్షణికావేశంలో పిచ్చిపనులు చేస్తుంటారు.
ఈ మధ్య పనివాళ్లు తెగ రెచ్చిపోతున్నారు..వాళ్లను పొరపాటున ఒక్క మాట అన్న కూడా పడటం లేదు ..పైగా పగ పెంచుకుంటున్నారు. వారి పనితీరు నచ్చక పనిలోంచి తీసేసిన ద్వేషంతో రగిలిపోతారు. ఒకవేళ పనిలో చేసేటప్పుడు చివాట్లు పెట్టిన వారిపై పగలు పెంచుకుంటారు. ఆ తర్వాత క్షణికావేశంలో పిచ్చిపనులు చేస్తుంటారు. వారిపై ఎలాగైన పగ తీర్చుకోవాలని రకారకాలుగా ఆకతాయి పనులు చేసి జీవితాలను నాశనం చేసుకుంటారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం.
నొయిడాలోని ఓ హౌసింగ్ సోసైటీలో ఓ వ్యక్తి క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతని పనితీరు నచ్చక అతన్ని పనిలోంచి తీసేయాలని సొసైటీ సభ్యులు నిశ్చయించుకున్నారు. దీంతో కోపంతో రగిలిపోయిన అతను డజనుకు పైగా కార్లపై యాసిడ్ పోసి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. దీంతో కార్లన్నీ ఘోరంగా ధ్వంసమయ్యాయి. అయితే దీనికి గల కారణాలేంటని సమీపంలోని సీసీటీవీ ఫుట్‌జ్ పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
అయితే ఇదంత క్లీనర్ రామ్‌రాజ్ పని అని తెలిసి సోసైటీ వాసులు షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో కనిపించిన అగంతుకుడ్ని గుర్తించిన సోసైటీ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ట్రాక్ చేసి అపార్ట్ మెంట్ వాసుల వద్దకు తీసుకువచ్చారు. ఆ తర్వాత వారంతా ఆ క్లీనర్‌పై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో క్లీనర్ తనకు ఎవరో యాసిడ్ ఇచ్చారంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ..పోలీసులు అతన్ని నేరస్తుడిగా అనుమానించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ క్లీనర్ సోసైటీలో 2016 నుంచి పని చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.