ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని మధుర(Madhura)లో ఘోరం జరిగింది. ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లిన మహిళను ఓ యువకుడు వెంటపడి వేధించాడు. చంకలో బిడ్డను ఎత్తుకుని వెళుతున్న ఆమెను వెంబడించాడు. ఆమెను పట్టుకుని బలవంతగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని మధుర(Madhura)లో ఘోరం జరిగింది. ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లిన మహిళను ఓ యువకుడు వెంటపడి వేధించాడు. చంకలో బిడ్డను ఎత్తుకుని వెళుతున్న ఆమెను వెంబడించాడు. ఆమెను పట్టుకుని బలవంతగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగాల్(Bengal)కు చెందిన ఓ యువతి తన కుటుంబంతో కలిసి మధురకు వచ్చారు. అక్కడ ఉన్న ఆలయాలను సందర్శిస్తున్న సమయంలో ఆ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఆమె వెంటపడ్డాడు. అతడి బారి నుంచి ఆమె తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆ యువకుడు ఆమెను సమీపించి బలవంతంగా ముద్దు పెట్టి అక్కడ్నుంచి పారిపోయాడు. ఈ ఘటన తర్వాత ఆ మహిళ బెంగాల్‌కు వెళ్లిపోయారు. అయితే గ్రామపెద్దలకు ఈ విషయం తెలిసింది. వెంటనే పంచాయితీ పెట్టి యువకుడిని నిలదీశారు. చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పిన ఆ యువకుడు తన చెప్పుతో పదిసార్లు కొట్టుకున్నాడు. యువతి పట్ల అనుచితంగా ప్రవర్శించిన ఆ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ యువతి కానీ, ఆమె కుటుంబసభ్యులు కానీ పోలీసులకు కంప్లయింట్ చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు.