అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం కోట్లాది భారీయుల చిరకాల స్వప్నం. ఆ మహత్తర ఘడియలు రానే వచ్చాయి. ప్రతి ఒక్క భారతీయుని 500 ఏళ్ల కల సాకారమవుతున్న తరుణంలో..ఈ అద్భుతమైన మహాఘట్టాన్ని కనులారా తిలకించేందుకు దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి కళ్లు అయోధ్య వైపే. ఈ మధురమైన క్షణాల కోసం అంతా అయోధ్యకు చేరుకుంటున్నారు.

Bollywood Stars in ayodha
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం (Ram Mandir Inauguration) కోట్లాది భారీయుల చిరకాల స్వప్నం. ఆ మహత్తర ఘడియలు రానే వచ్చాయి. ప్రతి ఒక్క భారతీయుని 500 ఏళ్ల కల సాకారమవుతున్న తరుణంలో..ఈ అద్భుతమైన మహాఘట్టాన్ని కనులారా తిలకించేందుకు దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి కళ్లు అయోధ్యపైనే ఉన్నాయి. ఈ మధురమైన క్షణాల కోసం అంతా అయోధ్యకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ప్రముఖ అగ్ర సినీ తారలంతా అయోధ్యకు చేరుకున్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి దంపతులు(Megastar Chiranjeevi couple), రామ్ చరణ్(Ram Charan) ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య ఎయిర్ పోర్టులో వారికి ఘనస్వాగతం చెప్పారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు (Tollywood celebrities) అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. ఇక అటు బాలీవుడ్ నుంచి కూడా చాలా మంది అగ్రతారలు శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ (Sri Rama Prana Pratishtha) వీక్షించేందుకు హాజరవుతున్నారు. వారిలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, మాధురీ దీక్షిత్ నానే, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, జాకీ ష్రాఫ్, ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్, అలియా భట్ నిర్మాతలు రాజ్‌కుమార్ హిరానీ, మహావీర్ జైన్, రోహిత్ శెట్టి ఉన్నారు. కాగా.. అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, సినీ నిర్మాత మధుర్ భండార్కర్, వివేక్ ఒబెరాయ్, సింగర్ సోనూ నిగమ్, మనోజ్ జోషి ఇప్పటికే అయోధ్యలో అడుగుపెట్టారు. మరోవైపు తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్, నటుడు ధనుశ్ కూడా అయోధ్య అడుగుపెట్టారు.
