ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని బల్లియాలో(Ballia) 40 మందితో ప్రయాణిస్తున్న పడవ.. గంగా నదిలో(Ganga River) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇరవైమందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. అందిన సమాచారం ప్రకారం.. బల్లియా జిల్లాలోని మల్దేపూర్(Maldepur) గంగా ఘాట్ వద్ద ఈ సంఘటన జరిగింది. ముందన్ యాత్రకు హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

Big Breaking
ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని బల్లియాలో(Ballia) 40 మందితో ప్రయాణిస్తున్న పడవ.. గంగా నదిలో(Ganga River) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇరవైమందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. అందిన సమాచారం ప్రకారం.. బల్లియా జిల్లాలోని మల్దేపూర్(Maldepur) గంగా ఘాట్ వద్ద ఈ సంఘటన జరిగింది. ముందన్ యాత్రకు హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఓ కుటుంబానికి చెందిన బంధువులందరూ పడవలో వెళ్తుండగా ఒక్కసారిగా బోల్తా పడింది. పడవ బోల్తా పడటంతో.. నీటిలో పడిన వారి అరుపులు విన్న స్థానికులు సహాయం చేసేందుకు వచ్చారు. అరడజను మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఇంకా 20 నుంచి 25 మంది గల్లంతైనట్లు సమాచారం. స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారికోసం నదిని జల్లెడ పడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
