హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవి లత న్యూఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి బన్సూరి స్వరాజ్‌కు మద్దతుగా జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు.
హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవి లత న్యూఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి బన్సూరి స్వరాజ్‌కు మద్దతుగా జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రసంగించారు. స్వాతి మలివాల్‌పై దాడికి సంబంధించిన వివాదంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఆమె విరుచుకుపడ్డారు. ఆప్‌ని హేళన చేస్తూ.. "చెప్పండి, ఆ పార్టీ పేరు ఆమ్ ఆద్మీ పార్టీ.. వారు సామాన్యుల సొమ్మును తింటున్నారు" అని ఆమె అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ఆమె ఇలా అన్నారు, “మీరు మీ సిద్ధాంతాలను ఎక్కడ వదిలివేశారు?. మీ కడుపు నిండగానే.. మీరు సాధారణ ప్రజలను మరచిపోతారా.. రాజకీయాల్లో ఇంత సులభమా? ఆయనపై ఈడీ దాడులు జరుగగానే.. దానికి బీజేపీయే కారణమని ఆరోపించారు. ఆయన డబ్బును ఎక్కడి నుండి పొందాడనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవడం అతనికి ఇష్టం లేదని.. పరిస్థితులు తెలియజేస్తున్నాయన్నారు.
స్వాతి మలివాల్‌పై దాడి వివాదంపై మాట్లాడుతూ.. “రాజకీయం మిమ్మల్ని చాలా చెడ్డగా మార్చింది, మీరు మీ ఇంటికి ఒక మహిళను పిలిచి ఆమెపై దాడి చేస్తారా? మీరు ఇంత కింది స్థాయికి దిగజారిపోయారా? నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీ బిడ్డ విషయంలో అదే జరిగితే.. మీరు మౌనంగా ఉంటారా? అని ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడుతూ.. “దేశానికి మహిళా శక్తి అవసరమని, ఈ అవసరాన్ని అర్థం చేసుకునే వ్యక్తి ఒక్కరే - ప్రధాని నరేంద్ర మోదీ” అని అన్నారు. గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ చేసినంత పని చేసే ధైర్యం ఎవరికీ లేదన్నారు. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు మే 25న ఒకే దశలో ఓటింగ్ జరగనుంది.