ఈ ఏడాది చివర జరగనున్న మధ్యప్రదేశ్(Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు(Assembly elections) అభ్యర్థుల(Candidates) తొలి జాబితాను బీజేపీ గురువారం ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించకముందే..
ఈ ఏడాది చివర జరగనున్న మధ్యప్రదేశ్(Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు(Assembly elections) అభ్యర్థుల(Candidates) తొలి జాబితాను బీజేపీ గురువారం ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించకముందే.. బీజేపీ(BJP) అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ఇదే తొలిసారి. 90 మంది సభ్యులున్న ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) అసెంబ్లీకి తొలి జాబితాలో 21 మంది అభ్యర్థులను, 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి 39 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను పార్టీ ప్రకటించింది.
అయితే తొలి జాబితాలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్(Bhupesh Baghel)పై బీజేపీ విజయ్ బాఘేల్(Vijay Baghel)ను రంగంలోకి దించింది. భూపేష్ బాఘేల్‌కు విజయ్ బాఘెల్ మేనల్లుడు కావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికలలో వీరు మూడుసార్లు ముఖాముఖిగా తలపడగా.. ఇందులో భూపేష్ బఘెల్ రెండుసార్లు (2003, 2013), విజయ్ బాఘెల్ ఒకసారి (2008) గెలిచారు.
గత ఎన్నికల్లో భూపేష్ బఘెల్‌పై మోతీలాల్ సాహును బీజేపీ పోటీకి నిలబెట్టింది. బఘెల్ 27,477 ఓట్లతో గెలిచారు. బీజేపీ తొలి జాబితాలో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌తో పాటు ఆయన ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు, మాజీ మంత్రి స్థానానికి అభ్యర్థులను కూడా ప్రకటించారు. మంత్రి ఉమేష్ పటేల్‌కు చెందిన ఖర్సియా స్థానం నుండి మహేష్ సాహు, మంత్రి అనిలా భెడియా దొండిలోహరా స్థానం నుండి దేవ్‌లాల్ ఠాకూర్, మంత్రి జైసింగ్ అగర్వాల్ కోర్బా స్థానం నుండి లఖన్‌లాల్ దేవాంగన్ లను బరిలో ఉంచింది.
మొదటి జాబితాలో ఒక ఎంపీ (విజయ్ బాఘెల్), ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు (రాంవిచార్ నేతమ్), ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు (లఖన్ దేవాంగన్, సంజీవ్ షా, శ్రవణ్ మార్కం) గత ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసిన ఇద్దరు నాయకులు (దేవ్‌లాల్ ఠాకూర్, రోహిత్ సాహు) అభ్యర్ధులుగా ఎంపికయ్యారు.
21 మంది జాబితాలో అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా 14 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మొదటి జాబితాలో ఎనిమిది మంది అభ్యర్థులు OBC నుండి ఉండగా.., వారిలో నలుగురు సాహు వర్గానికి చెందినవారు.
రాష్ట్రంలో ఎస్టీ కేటగిరీకి రిజర్వ్ చేసిన 29 సీట్లలో 10, ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ చేసిన 10 సీట్లలో ఒకదానికి అభ్యర్థులను ప్రకటించారు. గిరిజన ముఖ్యమంత్రి కావాలనే డిమాండ్‌పై గళం విప్పిన రాంవిచార్ నేతమ్ మరోసారి తన సంప్రదాయ స్థానమైన రామానుజ్‌గంజ్ నుంచి నామినేట్ అయ్యారు. నేతం ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రచారానికి ఎక్కువ సమయం దొరుకుతుందని.. ఎన్నికల ప్రకటనకు ముందే అభ్యర్థులను ప్రకటించాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించిందని.. దీంతో అభ్యర్థులకు మరింత సమయం లభిస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్‌సా తెలిపారు.
అభ్యర్ధుల ప్రకటనపై ప్రత్యేకత ఏమీ లేదని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అన్నారు. 21 మంది అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ ఇంత త్వరగా జాబితా ఎందుకు విడుదల చేసింది అనేది అందరికీ తెలిసిందే. బీజేపీ అభ్యర్థుల గెలుపుపై ముఖ్యమంత్రి.. ముందుగా తమ స్థానాన్ని అంచనా వేయాలని అన్నారు. భయాన్ని చూపించి, అత్యాశతో ప్రజలను విచ్ఛిన్నం చేయాలనుకుంటోంది బీజేపీ.