ప్రజాస్వామ్య దేశంలో ఊహించినదే జరుగుతోంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలను కబళించే ప్రయత్నంలో బీజేపీ(BJP) విజయం సాధిస్తూ వస్తున్నది. హిమాచల్‌ప్రదేశ్‌పై(Himachal pradesh) కన్నేసిన మోదీ(Narendra modi) షా(Amit shah) ద్వయం ప్రభుత్వాన్ని కూల్చే పనిలో ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో(Parliament elections) భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అనూహ్యంగా ఓడిపోయారు. దాంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది.

ప్రజాస్వామ్య దేశంలో ఊహించినదే జరుగుతోంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలను కబళించే ప్రయత్నంలో బీజేపీ(BJP) విజయం సాధిస్తూ వస్తున్నది. హిమాచల్‌ప్రదేశ్‌పై(Himachal pradesh) కన్నేసిన మోదీ(Narendra modi) షా(Amit shah) ద్వయం ప్రభుత్వాన్ని కూల్చే పనిలో ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో(Parliament elections) భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అనూహ్యంగా ఓడిపోయారు. దాంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. ముందునుంచే పావులు కదుపుతూ వస్తున్న బీజేపీ అధినాయకత్వం ఇప్పుడేమాత్రం ఆలస్యం చేయబోవడం లేదు. ఈ రోజు ఉదయం రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత జైరాంఠాకూర్‌ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. వెంటనే రాష్ట్ర శాసనసభలో బల పరీక్ష నిర్వహించాల్సిందిగా బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను(Shiva Prathap shukla) కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిందని, అందుకే గవర్నర్‌ను కలిసి ఫ్లోర్‌ టెస్ట్‌ పెట్టాల్సిందిగా కోరామని జైరాం ఠాకూర్‌(Jay ram Thakur) చెప్పుకొచ్చారు. మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. దాంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ బలం ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ లేకుండా పోయింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులకు సమానంగా 34 ఓట్లు వచ్చాయి. లాటరీ తీయగా బీజేపీ అభ్యర్థి హర్ష్‌ మహజన్‌ గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ మనుసింఘ్వి ఓటమి పాలయ్యారు. హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 68. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 40 స్థానాలు లభించాయి. బీజేపీ పాతిక సీట్లనే గెల్చుకుంది. ముగ్గురు ఇండిపెండెంట్లు గెలిచారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి వేచిచూసింది బీజేపీ. ఇప్పుడు సమయం వచ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు కూడా బీజేపీకి ఓటు వేయడంతో ఆ పార్టీ బలం ఒక్కసారిగా 34కు పెరిగింది. ఆరుగురు సభ్యులను కోల్పోవడంతో కాంగ్రెస్‌ బలం 34కు తగ్గి మైనారిటీలో పడిపోయింది. ఇప్పుడు బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక్క సభ్యుడి మద్దతు ఉంటే సరిపోతుంది. ఇంత చేసిన బీజేపీకి ఒక్క సభ్యుడి మద్దతు కూడగట్టుకోవడం కష్టమైనపనేమీ కాదు. హిమాచల్‌ ప్రదేశ్‌ కూడా పోతే, ఇప్పుడు కాంగ్రెస్‌కు మిగిలినవి కర్ణాకట, తెలంగాణ రాష్ట్రాలే!

Updated On 28 Feb 2024 12:44 AM GMT
Ehatv

Ehatv

Next Story