భారతీయ జనతా పార్టీ(BJP) తరఫున త్రిసూర్(Thrissur) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సినీ నటుడు సురేశ్ గోపీ(suresh Gopi) కేంద్ర మంత్రి కూడా అయ్యారు.
భారతీయ జనతా పార్టీ(BJP) తరఫున త్రిసూర్(Thrissur) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన సినీ నటుడు సురేశ్ గోపీ(suresh Gopi) కేంద్ర మంత్రి కూడా అయ్యారు. సురేశ్ గోపీ బీజేపీకి చెందిన వ్యక్తే అయినప్పటికీ ఆయన అన్ని పార్టీలకు దగ్గరవ్వాలనుకుంటున్నారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని(Indira gandhi) భారతమాత అని శ్లాఘించారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి(congress) చెందిన మాజీ ముఖ్యమంత్రి కరుణాకరణ్, మార్క్సిస్ట్ సీనియర్ నేత ఈకే నయనార్(EK Nayar) తన రాజకీయ గురువులని చెప్పారు.
కేరళలో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ సురేశ్ గోపి పున్‌కున్నంలోని కరుణాకరన్ స్మారకం మురళీ మందిరాన్ని సందర్శించారు. కరుణాకరన్ స్మారకం సందర్శనకు ఎలాంటి రాజకీయాలు జోడించవద్దని మీడియాను కోరారు. తన గురువుకు నివాళి అర్పించేందుకే ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. కరుణాకరన్‌ను కేరళ కాంగ్రెస్ తండ్రిగా ఆయన అభివర్ణించారు. కరుణాకరన్ ధైర్యవంతమైన పాలకుడని ప్రశంసించారు. త్రిసూర్‌లో సురేశ్‌గోపీపి బరిలో నిలిచిన కరుణాకరన్ కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి మురళీధరన్ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. మార్క్సిస్ట్ సీనియర్ నేత ఈకే నయనార్, ఆయన భార్య శారద టీచర్ లాగే కరుణాకరన్, ఆయన భార్య కల్యాణికుట్టి అమ్మతో తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సురేశ్ గోపీ చెప్పుకొచ్చారు. జూన్ 12న కుటుంబ సభ్యులతో కలిసి కన్నూర్‌లోని నయనార్ ఇంటికి కూడా సురేశ్ గోపీ వెళ్లారు