త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో(General elections) ఘన విజయం సాధించి మరోసారి అధికారంలోకి రావాలని భారతీయ జనతాపార్టీ(BJP) అనుకుంటోంది. 400 సీట్లను అధిగమించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వ్యూహాలు రచించుకుంటోంది. గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది. కర్ణాటకలోని కొడగు-మైసూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి మైసూరు రాజ వంశీకుడిని(royal descendant) పోటీ చేయించాలన్నది బీజేపీ వ్యూహంలో భాగం.

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో(General elections) ఘన విజయం సాధించి మరోసారి అధికారంలోకి రావాలని భారతీయ జనతాపార్టీ(BJP) అనుకుంటోంది. 400 సీట్లను అధిగమించాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వ్యూహాలు రచించుకుంటోంది. గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది. కర్ణాటకలోని కొడగు-మైసూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి మైసూరు రాజ వంశీకుడిని(royal descendant) పోటీ చేయించాలన్నది బీజేపీ వ్యూహంలో భాగం. ఇప్పటికే ఈ వంశానికి చెందిన యదువీర్‌ కృష్ణదత్త చామరాజ వడియార్‌తో(Yaduveer Krishnadatta Chamaraja Wadiyar) బీజేపీ నేతలు చర్చలు జరిపారట! అయితే ఆయన మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట! ఈ విషయంలో రాజమాత ప్రమోద దేవి(Pramodha devi) వడియార్‌దే తుది నిర్ణయమట! ఈ నియోజకవర్గం ముఖ్యమంత్రి సిద్దరామయ్య(CM Siddaramaiah) ఇలాఖా. సిద్ధరామయ్యతో శత్రుత్వం పెట్టుకోవడం మంచిది కాదన్నది రాజమాత భావన. ఎవరినీ శత్రువులుగా మార్చుకోకుండా అందరితో సఖ్యతగా ఉండాలని రాజ కుటుంబం కోరుకుంటున్నట్టు కొందరు బీజేపీ నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీనే విజయం సాధించింది. విజయం సాధించిన ప్రతాప్‌ సింహను బీజేపీ అధినాయకత్వం ఈసారి పక్కన పెట్టింది. పార్లమెంట్‌ భద్రత ఉల్లంఘన కేసులో ప్రతాప్‌సింహ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే! నాలుగు నెలల కిందట పార్లమెంట్‌ భద్రతను ఉల్లంఘించి లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు దూకి అలజడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అందులో ఒకరికి ప్రతాప్‌సింహనే విజటర్‌ పాస్‌ ఇచ్చారు. ఈ కారణంతోనే బీజేపీ అధిష్టానం ప్రతాప్‌సింహను పోటీకి దూరంగా ఉంచినట్టు చెబుతున్నారు.

Updated On 12 March 2024 1:12 AM GMT
Ehatv

Ehatv

Next Story