BJP Candidates First List : ఏ క్షణమైనా బీజేపీ ఫస్ట్ లిస్ట్...!
రాజాసింగ్‌పై(Raja singh) సస్పెన్షన్(Suspension) ఎత్తివేసిన బీజేపీ(BJP) అధిష్టానం, ఏ క్షణంలోనైనా ఫస్ట్ లిస్ట్(First List) రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదలకు బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన(Janasena) 20 స్థానాలను తమకు కేటాయించాలని కోరుతోంది.
రాజాసింగ్‌పై(Raja singh) సస్పెన్షన్(Suspension) ఎత్తివేసిన బీజేపీ(BJP) అధిష్టానం, ఏ క్షణంలోనైనా ఫస్ట్ లిస్ట్(First List) రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదలకు బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన(Janasena) 20 స్థానాలను తమకు కేటాయించాలని కోరుతోంది. తొలుత 30-35 స్థానాలు కోరినప్పటికీ తాజాగా 20 స్థానాలను కేటాయించాలని బీజేపీని జనసేన కోరుతోంది. ముఖ్యంగా తమకు ఖమ్మం జిల్లాలో ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన అంటోంది. అయితే బీజేపీ మాత్రం 10 నుంచి 12 స్థానాల జనసేనకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లిస్టులో బీసీలకు 20 స్థానాలు, రెడ్డిలకు 14, వెలమలకు 6 స్థానాలు ఇచ్చారని తెలుస్తోంది.
టికెట్ ఖరారైన అభ్యర్థులకు ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నారని, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిసింది. ఈసారి కిషన్‌రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు ఎంపీలను అసెంబ్లీలోకి బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్(Bandi Sanjay), కోరుట్ల నుంచి అర్వింద్(Arvindh), ఆదిలాబాద్ నుంచి సోయంబాపూరావును(Soyam Bapurao) పోటీ చేయించనుందని సమాచారం. కామారెడ్డి నుంచి పోటీకి విజయశాంతి కాలుదువ్వుతున్నారు. గజ్వేల్, హుజూరాబాద్ నుంచి ఈటల పోటీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.