భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ప్రతిపక్షంలో కూర్చోవాలని

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ప్రతిపక్షంలో కూర్చోవాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సూచించారు. BJP ప్రతిపక్షంలో కూర్చుని I.N.D.I.A కూటమి ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేయాలని ఆయన ట్విట్టర్ లో సూచించారు. మరో ట్వీట్‌లో.. ఆయన బీజేపీ 272 మెజారిటీ మార్క్‌ను దాటలేకపోయినందున ప్రధాని మోదీ తప్పుకోవాలని సూచించారు. బీజేపీ మెజారిటీ 272 కంటే 240కి పడిపోయినందున మోదీ తప్పుకోవాల్సిన అవసరం ఉందని రాశారు. ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్న నాయకుడైనా రాజీనామా చేస్తారని ఆయన విమర్శించారు.

18వ లోక్‌సభ ఎన్నికల్లో 293 సీట్లు గెలుచుకుని, బీజేపీ నేతృత్వంలోని NDA మెజారిటీ మార్కును తృటిలో అధిగమించింది. ప్రధాని మోదీ జూన్ 8న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరిగింది. భారత ఎన్నికల సంఘం ప్రకారం, బీజేపీ 240 సీట్లు గెలుచుకుంది, 2019 లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 2019లో 52 స్థానాలు దక్కించుకోగా.. 99 సీట్లు గెలుచుకుని బలమైన వృద్ధిని సాధించింది.

Updated On 6 Jun 2024 3:25 AM GMT
Yagnik

Yagnik

Next Story