బీజేపీ(BJP) తొలి జాబితాలో ఊహించినట్టుగానే భోపాల్ లోక్‌సభ సభ్యురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు(Sadhvi Prajnasingh Thakur) చోటు దక్కలేదు. ఈ స్థానాన్ని అలోక్ శర్మకు(Alok Sharma) కేటాయించారు. దీనిపై బీజేపీలో చర్చ జరుగుతోంది. గతంలో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే ఆమెకు ఈసారి బీజేపీ అధినాయకత్వం మొండి చేయి చూపించింది. దీనిపై ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ రియాక్టయ్యారు. తనను క్షమించలేనని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi) గతంలోనే చెప్పారని వ్యాఖ్యానించారు.
బీజేపీ(BJP) తొలి జాబితాలో ఊహించినట్టుగానే భోపాల్ లోక్‌సభ సభ్యురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు(Sadhvi Prajnasingh Thakur) చోటు దక్కలేదు. ఈ స్థానాన్ని అలోక్ శర్మకు(Alok Sharma) కేటాయించారు. దీనిపై బీజేపీలో చర్చ జరుగుతోంది. గతంలో ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే ఆమెకు ఈసారి బీజేపీ అధినాయకత్వం మొండి చేయి చూపించింది. దీనిపై ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ రియాక్టయ్యారు. తనను క్షమించలేనని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi) గతంలోనే చెప్పారని వ్యాఖ్యానించారు. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయనను అసంతృప్తికి గురిచేశాయని అన్నారు. గతంలో కూడా తాను టికెట్ కోరలేదని, ఇప్పుడూ కూడా టికెట్ అడగడం లేదని అన్నారు. గతంలో తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రధానికి నచ్చలేదని చెబుతూ తన వ్యాఖ్యలపై ప్రధాని తనను ఎప్పటికీ క్షమించలేదని కూడా అన్నారని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. తాను మాత్రం ఆయనను క్షమాపణలు కోరానన్నారు. పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తనకు టికెట్ ఇవ్వలేదనే అంశంపై దృష్టి పెట్టొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్ పై 3.64,822 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో జైలులో ఉన్న ప్రజ్ఞా ఠాకుర్ ఆరోగ్య సమస్యల కారణంతో బయటకు వచ్చారు. భోపాల్ నుంచి పోటీ చేసి గెలిచారు. గాడ్సేను దేశ భక్తుడని గతంలో ఆమె అభివర్ణించడం వివాదాస్పదమైంది.2008 ఉగ్రదాడుల సమయంలో మరణించిన ముంబాయి ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరేపై చేసిన కామెంట్లు కూడా అప్పట్లో పెను సంచలనంగా మారాయి.ప్రజ్ఞా ఠాకుర్‌తో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన సిటింగ్ ఎంపీలైన పర్వేశ్ వర్మ, రమేశ్ బిధూరి, జయంత్ సిన్హాలకు కూడా తొలి జాబితాలో చోటు దక్కలేదు.