కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు(Karnataka Assembly Polls అధికార‌ బీజేపీ(BJP) స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలోనే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో 23 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఇటీవలే బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ నేత నాగరాజు చబ్బీ కల్‌ఘట్గి నుంచి పోటీ చేయనున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)) నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎస్సీ అభ్యర్థి అశ్విని సంపంగి(Ashwini Sampangi) బరిలో ఉన్నారు. మంగళవారం బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుద‌ల చేసింది. ఈ […]

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు(Karnataka Assembly Polls అధికార‌ బీజేపీ(BJP) స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలోనే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో 23 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఇటీవలే బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ నేత నాగరాజు చబ్బీ కల్‌ఘట్గి నుంచి పోటీ చేయనున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF)) నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎస్సీ అభ్యర్థి అశ్విని సంపంగి(Ashwini Sampangi) బరిలో ఉన్నారు. మంగళవారం బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుద‌ల చేసింది. ఈ జాబితాలో 189 మంది అభ్య‌ర్ధుల పేర్లు ప్ర‌క‌టించింది. బీజేపీ ఈసారి 52 మంది కొత్త ముఖాలను రంగంలోకి దించింది. 189 మంది అభ్యర్థుల జాబితాలో.. 32 మంది ఇతర వెనుకబడిన తరగతుల (OBC) నుండి కాగా.. 30 మంది షెడ్యూల్డ్ కులాల నుండి, 16 మంది షెడ్యూల్డ్ తెగల నుండి ఉన్నారు. జాబితాలో 8 మంది మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది.

మంగళవారం విడుదల చేసిన తొలి జాబితాలోని 189 స్థానాల్లో కనీసం 125 నుంచి 130 స్థానాలు అతి సునాయాసంగా గెలుస్తాం అని కర్ణాటక(Karnataka) మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప అన్నారు. రాష్ట్రంలోని 224 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండ‌గా.. మొత్తం సీట్లలో 150 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్(Arun Singh).. కర్ణాటక ముఖ్యమంత్రి సీఎం బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. మరోవైపు మాజీ సీఎం బీఎస్‌ యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర షికారిపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

ఏప్రిల్ 13 నుండి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్(Nominations) పత్రాల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 20. కర్ణాటకలో పూర్తి మెజారిటీతో మ‌ళ్లీ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. మొత్తం 224 అసెంబ్లీ(Assembly) స్థానాల్లో కనీసం 150 స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Updated On 12 April 2023 9:35 PM GMT
Yagnik

Yagnik

Next Story