భారతీయ జనతాపార్టీ(BJP) నాయకురాలు నుపుర్ శర్మ(Nupur Sharma) గుర్తున్నారా? ముస్లింవర్గాన్ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను ఎవరు మాత్రం మర్చిపోగలరు? ఆమెపై అప్పట్లో బోల్డన్ని విమర్శలు రావడంతో గత్యంతరం లేక ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. ఇప్పుడామె అవసరం బీజేపీకి పడింది. సస్పెన్షన్‌ను(Suspension)ఎత్తివేసే ఆలోచనలో బీజేపీ ఉంది. అందుకు కారణం కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ(Raibareli) లోక్‌సభ స్థానం నుంచి నుపుర్ శర్మను దింపాలనుకోవడమే! రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ(Sonia gandhi) వరుసగా అయిదుసార్లు విజయం సాధించారు.
భారతీయ జనతాపార్టీ(BJP) నాయకురాలు నుపుర్ శర్మ(Nupur Sharma) గుర్తున్నారా? ముస్లింవర్గాన్ని కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను ఎవరు మాత్రం మర్చిపోగలరు? ఆమెపై అప్పట్లో బోల్డన్ని విమర్శలు రావడంతో గత్యంతరం లేక ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. ఇప్పుడామె అవసరం బీజేపీకి పడింది. సస్పెన్షన్‌ను(Suspension)ఎత్తివేసే ఆలోచనలో బీజేపీ ఉంది. అందుకు కారణం కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీ(raebareli) లోక్‌సభ స్థానం నుంచి నుపుర్ శర్మను దింపాలనుకోవడమే! రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ(Sonia gandhi) వరుసగా అయిదుసార్లు విజయం సాధించారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఎవరు పోటీ చేస్తారన్నది ఇంకా తేలలేదు. ప్రియాంక గాంధీ(Priyanka Gandi) పోటీ చేసే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి కానీ దీనిపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి వివరణ రాలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఆమేథి నియోజకవర్గాన్ని బీజేపీ గెల్చుకుంది. ఈసారి రాయ్‌బరేలీని కూడా గెల్చుకుని యూపీలో కాంగ్రెస్ లేకుండా చేయాలని బీజేపీ అనుకుంటోంది. ఈ క్రమంలోనే అక్కడి నుంచి నుపుర్ శర్మను బరిలో దించాలని భావిస్తోంది. న్యూఢిల్లీకి చెందిన నుపుర్ శర్మ విద్యార్థిగా ఉన్నప్పుడు బీజేపీ స్టూడెంట్ యూనియన్ ఏబీవీపీలో క్రియాశీలకంగా పని చేశారు. న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న నుపుర్ కొంతకాలం న్యాయవాద వృత్తిలో ఉన్నారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈమెకు టికెట్ ఇచ్చింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేసి 31 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.