భారతదేశానికి స్వాతంత్ర సిద్ధించిన తర్వాత దేశంలో, పలు రాష్ట్రాలలో కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించింది. అలాంటి సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాలలో హిందుత్వమే ఎజెండాగా 1952 సంవత్సరంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో జన సంఘ అనే పార్టీ ఏర్పడింది. మొదటిసారి జరిగిన లోకసభ ఎన్నికల్లో కేవలం 3 స్థానాలనే మాత్రమే సాధించింది. తర్వాత వివిధ పార్టీల కలయికతో జనతా పార్టీగా ఏర్పడి దేశంలో మొదటిసారి అదికారం లోకి వచ్చింది. […]

భారతదేశానికి స్వాతంత్ర సిద్ధించిన తర్వాత దేశంలో, పలు రాష్ట్రాలలో కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించింది. అలాంటి సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాలలో హిందుత్వమే ఎజెండాగా 1952 సంవత్సరంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో జన సంఘ అనే పార్టీ ఏర్పడింది. మొదటిసారి జరిగిన లోకసభ ఎన్నికల్లో కేవలం 3 స్థానాలనే మాత్రమే సాధించింది. తర్వాత వివిధ పార్టీల కలయికతో జనతా పార్టీగా ఏర్పడి దేశంలో మొదటిసారి అదికారం లోకి వచ్చింది. అనంతరం జరిగిన పలు ఎన్నికల్లో జనతా పార్టీ విఫలం కావడం, జనసంగులో విభేదాలు రావడం 1980 ఏప్రిల్ 6న అటల్ బీహార్ వాజ్పేయి మరియు ఎల్ కె అద్వానీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పురుడు పోసుకుంది.

నాటి నుండి నేటి వరకు దేశంలో అధిక సంఖ్యాకులుగా ఉన్న హిందూ ప్రజల మనోభావా లు, దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, సాంఘిక నియమాలు, దృఢమైన ప్రజాస్వామ్య విలువలు, జాతీయ భావజాలం దేశ రక్షణ ధ్యేయంగా అటల్ బీహార్ వాజ్పేయి ఎల్కే అద్వానీ లాంటి ఎంతోమంది ప్రముఖ నాయకులు, పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లారు. సఫలీకృతులయ్యారు. అనతి కాలలోనే దేశ ప్రజల విశ్వాసాన్ని భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంది.

మరియు ముఖ్యంగా ఈ 8 ఏడ్ల కాలంలో దేశంలో ఎన్నో రాష్ట్రాలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి చాణిక్యంతో భారతీయ జనతా పార్టీ కొత్త పుంతలు తొక్కింది. సకల జనుల ప్రజల ఆదరాభిమానాలను చురగొంటు అధికారం వైపు అడుగులు వేసింది. సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎక్కడికక్కడికి ఎండగడుతూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో వారసత్వ రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు అవినీతి మరకలు ఇలాంటి ఎన్నో అంశాలు బిజెపికి అనుకూలంగా మార్చుకొని అధికారుల్లోకి వచ్చింది.
2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 543 స్థానాలకు భారతీయ జనతా పార్టీ సొంతంగా 281 స్థానాలను కైవసం చేసుకుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మిత్రపక్షాలతో కలిపి బిజెపి 331 స్థానాలను సొంతం చేసుకుంది. నరేంద్ర మోడీ ప్రధానిగా బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చింది. తక్కువ కాలంలోనే నరేంద్ర మోడీ దేశ ప్రజల ప్రేమను పొంది జాతీయంగా అంతర్జాతీయంగా మోస్ట్ పాపులర్ పొలిటిషన్ గా పేరు గడించారు. మోడీ నాయకత్వంలో సబ్బండ వర్గాలకు మంత్రివర్గం లో చోటు ఇస్తూ సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు.

అనంతరం 2019 లోక్ సభ ఎన్నికల్లో 303 స్థానాల్లో విజయం సాధించి నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి మళ్లీ అధికారం చేపట్టింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ తన అధికారాన్ని చెలాయిస్తూ పార్టీని ప్రగతి పథంలో నడిపిస్తున్నాడు. పలు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో అనూన్యమైన విజయాలను పార్టీకి కట్టబెడుతూ బిజెపిని అధికారానికి తేవడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఏడు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో ఐదు రాష్ట్రాలలో తిరిగి తమ ప్రభుత్వాన్ని అధికారంలో తేవడం మామూలు విషయం కాదు. దేశంలో ఇప్పటికీ 16 రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉంది. లోక్ సభ, రాజ్యసభలో తమ పార్టీ బలాన్ని పెంచుకొని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులను సునాయాసంగా గెలిపించారు నరేంద్ర మోడీ. ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను చిత్తు చేస్తూ తిరుగులేని శక్తిగా బిజెపిని నిలబెట్టారు.

దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి దే అధికారం అంటూ తమ వ్యూహాలకు పదులు పెడుతూ విపక్షాల ఎత్తుగడలను పసిగడుతున్నారు. భారతీయ జనతా పార్టీ అంటే కేవలం ఉత్తరాదికే చెందిన పార్టీగా అంటున్న ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ అనతి కాలంలోనే దక్షిణాది రాష్ట్రాలపై కన్నువేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో అమిత్ షా చాకచక్యంతో దక్షిణాది రాష్ట్రాలలో పార్టీని విస్తరిస్తూ అధికారంలో రావడానికి పాగా వేసింది. అందుకు కావలసిన అన్ని వనరులను సమకూర్చుకుంటుంది.

దేశంలో అనేక సమస్యలతో కాంగ్రెస్ పార్టీ కకావికలమవుతుంటే భారతీయ జనతా పార్టీ మాత్రం భావి భారతానికి భరోసా మేమే దేశం వైపు..బిజెపి చూపు అంటూ రాజకీయాలలో దూసుకుపోతుంది. రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ కట్టడికి కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో 2023 ఎన్నికల్లో ఎలాంటి ఎత్తుగడలతో ప్రజలలోకి వెళుతుందో, అధికారానికి చేరు అవుతుందో లేదో చూడాలంటే కొంత కాలం ఆగాల్సిందే అని రాజకీయ పండితులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!

Updated On 6 April 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story