మొన్నాఆ మధ్య ఉచితాలపై ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) విమర్శలు చేశారుగా! ఉచితాల వల్ల దేశం తిరోగమనదిశలోకి వెళుతుందని మాట్లాడారుగా! ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో తేడా కొడుతుందని గ్రహించేసిన భారతీయ జనతాపార్టీ(BJP) ఉచితాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఓటర్లను ఆకర్షించడానికి ఉచిత హామీలను ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను రిలీజ్‌ చేసిన అధికార బీజేపీ

మొన్నాఆ మధ్య ఉచితాలపై ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) విమర్శలు చేశారుగా! ఉచితాల వల్ల దేశం తిరోగమనదిశలోకి వెళుతుందని మాట్లాడారుగా! ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో తేడా కొడుతుందని గ్రహించేసిన భారతీయ జనతాపార్టీ(BJP) ఉచితాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఓటర్లను ఆకర్షించడానికి ఉచిత హామీలను ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను రిలీజ్‌ చేసిన అధికార బీజేపీ తాము అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది. పేదలకు రోజుకు అరలీటర్‌ పాలను ఫ్రీగా ఇస్తామని తెలిపింది. అది కూడా నందిని బ్రాండ్‌ పాలు కావడం మరో విశేషం. ప్రజా ప్రణాళిక పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) మేనిఫెస్టోను విడుదల చేశారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం, సంక్షేమం కల్పించడమే బీజేపీ విజన్‌ అని ఆయన తెలిపారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా అమలవుతున్న ముస్లింల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామన్నారు,. ఉమ్మడి పౌరస్మృతిన అమలు చేస్తామని, పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇక మేనిఫెస్టోలో ఇంకొన్ని హామీలు కూడా ఉన్నాయి. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ప్రతిరోజు ఉచితంగా అర లీటర్‌ నందిని పాలు ఇస్తామని చెప్పింది..

అమూల్‌ బ్రాండ్‌ పాలకు ప్రాధాన్యతనిస్తూ కన్నడీగులు సొంతం చేసుకున్న నందిని బ్రాండ్‌ పాలను తక్కువ చేసి చూస్తున్నదంటూ బీజేపీపై కుప్పలు తెప్పలుగా విమర్శలు వచ్చాయి. ఈ పాల గొడవ బీజేపీ ఇమేజ్‌ను బాగా దెబ్బతీసింది. ఆ నష్ట నివారణ కోసం ఇప్పుడు నందిని పాలను భుజానకెత్తుకున్నది. ఇక పేదకుటుంబంలోని ప్రతీ వ్యక్తికి అయిదు కిలోల బియ్యం, అయిదు కిలోల తృణధాన్యాలతో నెలవారీ రేషన్‌ కిట్‌ ఇస్తామని ప్రకటించింది. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ఏటా ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. ఉగాది, వినాయక చవితి, దీపావళికి ఒక్కోటి చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. కర్ణాటక యాజమాన్య చట్టం సవరింపు, ప్రతి వార్డుకో లాబోరేటరీని ఏర్పాటు చేస్తామని, మైసూరులోని ఫిల్మ్‌ సిటీకి దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు పెడతామని పేర్కొంది. నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని ప్రతి వార్డులో అటల్‌ ఆహార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, నిరాశ్రయులకు 10 లక్షల ఇళ్ల స్థలాల కేటాయింపు చేస్తామని తెలిపింది. వృద్ధులకు ఉచితంగా వార్షిక హెల్త్‌ చెకప్‌లు, బెంగళూరుకు స్టేట్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్యాగ్, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం, రూ.30వేల కోట్లతో మైక్రో కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాల కల్పన, రూ.1500 కోట్లతో పర్యాటక రంగ అభివృద్ధి, మైసూరులో అంతర్జాతీయ ప్రమాణాలో దేశంలోనే అతి పెద్ద పునీత్‌ రాజ్‌కుమార్‌ ఫిల్మ్‌సిటీ ఏర్పాటు, విశ్వేశ్వరయ్య విద్యాయోచన కింద ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేస్తామని బీజేపీ తెలిపింది. ఇక రైతుల కోసం 30 వేల కోట్ల రూపాయల ఫండ్‌ను ప్రకటించింది. మైక్రో కోల్డ్‌ స్టోరేజ్‌ కేంద్రాల ఏర్పాటు, ప్రతీ గ్రామ పంచాయితీలో అగ్రో ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు, అగ్రికల్చరల్‌ ప్రొడ్యూస్‌ కమిటీలను ఆధునీకరించడం వంటి పలు హామీలు కూడా బీజేపీ ఇచ్చింది.

Updated On 1 May 2023 3:25 AM GMT
Ehatv

Ehatv

Next Story