లోక్‌సభ ఎన్నికల్లో(Lok sabha elections) బీజేపీ(BJP) తొలి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే కదా! గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేశ్‌ దలాల్‌ ఏకగ్రీవంగా గెలుపొందారు. కాంగ్రెస్‌(Congress) పార్టీ తరఫున పోటీ చేసిన నీలేశ్‌ కుంభానీ(Nilesh Kumbhani) నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యింది. నీలేశ్‌ దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలు సక్రమంగా లేవన్నది రిటర్నింగ్‌ అధికారి కంప్లయింట్‌! కారణమేమిటో తెలియదు కానీ మిగతా అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ముఖేశ్‌ దలాల్‌(Mukesh Dalal) గెలిచారు.

లోక్‌సభ ఎన్నికల్లో(Lok sabha elections) బీజేపీ(BJP) తొలి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే కదా! గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేశ్‌ దలాల్‌ ఏకగ్రీవంగా గెలుపొందారు. కాంగ్రెస్‌(Congress) పార్టీ తరఫున పోటీ చేసిన నీలేశ్‌ కుంభానీ(Nilesh Kumbhani) నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యింది. నీలేశ్‌ దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలు సక్రమంగా లేవన్నది రిటర్నింగ్‌ అధికారి కంప్లయింట్‌! కారణమేమిటో తెలియదు కానీ మిగతా అభ్యర్థులు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ముఖేశ్‌ దలాల్‌(Mukesh Dalal) గెలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలేశ్‌ కుంభానీ కనిపించకుండా పోవడం మిస్టరీగా ఉంది. కనీసం ఫోన్‌లో కూడా ఆయన అందుబాటులో లేడని, ఆయన ఇంటికి తాళం వేసి ఉందని స్థానిక మీడియా చెబుతోంది. నీలేశ్‌ త్వరలో బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థిని బెదిరించో, భయపెట్టో బీజేపీ ఈ పనులన్నింటినీ చేయించిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. నీలేశ్‌ ఇంటి ముందు నిరసన చేపట్టిన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయన ఇంటి గోడలపై ప్రజల ద్రోహి అంటూ పోస్టర్లు అంటించారు. సూరత్‌లో ఎన్నికలను వాయిదా వేయాలని, ఎన్నికల ప్రక్రియను మళ్లీ జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. సూరత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలేశ్‌ అభ్యర్థిత్వాన్ని నలుగురు ప్రతిపాదకులు నామినేట్‌ చేశారని, అకస్మాత్తుగా నలుగురు తమ సంతకాలను తిరస్కరించడం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ అన్నారు. ఇది యాదృచ్ఛికం కాదని, అభ్యర్థి చాలా సమయం నుంచి కనిపించడం లేదని ఆరోపించారు.

Updated On 23 April 2024 6:38 AM GMT
Ehatv

Ehatv

Next Story