అమిత్ షా రాజ్య సభ లో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు ఒక వైపు దుమారం రేపుతున్న సమయం లో విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ..
అమిత్ షా రాజ్య సభ లో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు ఒక వైపు దుమారం రేపుతున్న సమయం లో విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. పార్లమెంట్ భవనం పైకి ఎక్కి ఆందోళనలు చేశారు. ఇదే సమయం లో బిజెపి పార్టీ ఎం.పి. లు కూడా అంబేద్కర్ ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని ఎదురుదాడికి దిగుతూ ఆందోళన చేశారు. ఈ నేపథ్యం లో అక్కడ ఇండీ కూటమి ఎం.పి. లకు, బి.జె.పి. ఎం.పీ. లకు తోపులాట జరిగింది.
నిరసనలు జరుగుతున్న సమయం లో పోటాపోటీగా ఇరువర్గాల నాయకుల మధ్య జరిగిన తోపులాటలో ఎం.పి. సారంగీ గాయపడ్డారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన కన్నుకు గాయమయ్యింది. అయితే రాహుల్ గాంధీనే తనను గాయపరిచారని ప్రతాప్ సారంగి ఆరోపించారు. ఆయనే నన్ను తోసివేసారు అంటూ మీడియా తో చెప్పుకొచ్చారు.
ఈ ఘటన తో సభ వాయిదా పడింది. ఇక అమిత్ షా రాజ్య సభ లో అంబేద్కర్ నామ స్మరణ గురించిన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు అని అమిత్ షా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వివరణతో ఏకీభవించని విపక్ష కూటమి నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే మరియు ఇతర ఎం.పి. లు నిరసనలు చేపట్టారు