మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో(Maharshtra) బీజేపీ(BJP) నేతృత్వంలోని మహాయుతి విజయం సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో(Maharshtra) బీజేపీ(BJP) నేతృత్వంలోని మహాయుతి విజయం సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. మహా వికాస్‌ అఘాడి గెలుస్తుందని భావించారు. సుమారు ఆరు నెలల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో(Lok sabha elections) మహా వికాస్‌ అఘాడి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అవే రకమైన ఫలితాలు వస్తాయని విశ్లేషకులు కూడా అనుకున్నారు. ఫలితాలు మహాయుతికి అనుకూలంగా రావడంతో అక్కడి రాజకీయాలపై చర్యలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ, నటి కంగనా రనౌత్‌(Kangana ranauth) శివసేన (యూబీటీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రేపై విమర్శలు చేశారు. మహిళలను అవమానించిన కారణంగానే రాక్షసుడు ఈ పరిస్థితిని అనుభవించాల్సి వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ థాక్రే(Uddav Dhakre) ఓడిపోతారని తాను ముందే ఊహించానని చెప్పారు. మహిళలను గౌరవిస్తున్నారా? వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారా? అనే దానిని బట్టి ఎవరు రాక్షసుడో, ఎవరు మంచివారో ఈజీగా చెప్పవచ్చన్నారు.

'వారు నా ఇంటిని పడగొట్టారు. నానా దుర్భాషలాడారు. అలాంటి చర్యలకు పరిణామాలు ఉంటాయని నేను నమ్మాను' అని కంగనా రనౌత్‌ అన్నారు. పనిలో పనిగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడారు కంగనా. ఆయనను అజేయునిగా అభివర్ణించారు. ప్రధాని మోదీ దేశ రక్షణకు నియమితుడైన నేత అని కంగనా రనౌత్‌ శ్లాఘించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసేవారికి ఈ ఎన్నికల ఫలితాలు గుణపాఠమన్నారు. అభివృద్ధి, సుస్థిరత కోసం మహారాష్ట్ర ప్రజలు ఓట్లు వేశారని కంగనా రనౌత్‌ తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story