కాంగ్రెస్‌(Congress) వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్‌(NTR) తెలుగుదేశంపార్టీని(TDP) స్థాపించారు. తాను బతికున్నంత కాలం కాంగ్రెస్‌పై పోరాటం సాగించారు. ఎప్పుడైతే ఆ పార్టీని చంద్రబాబునాయుడు(Chandrababu) బలవంతంగా లాగేసుకున్నారో అప్పట్నుంచి విధి విధానాలంటూ లేకపోయాయి. అవసరార్థం కాంగ్రెస్‌తో కూడా మిలాఖత్‌ అవ్వగలరు చంద్రబాబు.

కాంగ్రెస్‌(Congress) వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్‌(NTR) తెలుగుదేశంపార్టీని(TDP) స్థాపించారు. తాను బతికున్నంత కాలం కాంగ్రెస్‌పై పోరాటం సాగించారు. ఎప్పుడైతే ఆ పార్టీని చంద్రబాబునాయుడు(Chandrababu) బలవంతంగా లాగేసుకున్నారో అప్పట్నుంచి విధి విధానాలంటూ లేకపోయాయి. అవసరార్థం కాంగ్రెస్‌తో కూడా మిలాఖత్‌ అవ్వగలరు చంద్రబాబు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈ విషయం స్పష్టమయ్యింది కూడా! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్‌తో టీడీపీ లోపాయికారీ ఒప్పందాన్ని కదుర్చుకున్నదని, రెండు పార్టీలు ఒక్కటేనని విశ్లేషకులు చెబితే చాలా మందికి డౌట్‌ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్‌ను నడిపిస్తున్నది చంద్రబాబేనని స్పష్టమయ్యింది. కాంగ్రెస్‌కు చంద్రబాబు డబ్బులిచ్చి నడిపిస్తున్నారని ఆధారాలతో సహా బయటపడింది. మరి బీజేపీతో(BJP) చంద్రబాబు పొత్తు ఎందుకు పెట్టుకున్నారనే సందేహం రావచ్చు. ప్రస్తుత పరిస్థితులో అది చంద్రబాబుకు అవసరం.

కేసుల నుంచి బయటపడాలంటే బీజేపీకి జై కొట్టక తప్పదు. పైగా ఎన్నికల్లో నాలుగు ఓట్లు ఎక్కువపడవచ్చనే ఆలోచన కూడా కావచ్చు. అధికారికంగా జనసేన(Janasena), బీజేపీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు అనధికారికంగా కాంగ్రెస్‌కు ఉన్నారు. తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన సీఎం రమేశ్‌ ద్వారానే కాంగ్రెస్‌కు భారీ మొత్తంలో డబ్బును అందించారు చంద్రబాబు. ఎలక్టొరల్‌ బాండ్స్‌లో ఈ విషయం స్పష్టంగా తెలిసిపోయింది. 30 కోట్ల రూపాయలను అధికారికంగా కాంగ్రెస్‌ పార్టీ ఫండ్‌ కింద చంద్రబాబు పంపించారు. అనధికారికంగా ఇంకెంత ముట్టచెప్పారో మరి! ఒకప్పుడు చంద్రబాబు కూడా కాంగ్రెస్‌ మనిషే కదా! బాబును మొదట ఎమ్మెల్యే చేసింది, మంత్రిని చేసింది కాంగ్రెస్‌ పార్టీనే కదా! ఆ మాత్రం కృతజ్ఞత చూపకపోతే ఎలా అని అనుకున్నారు కాబోలు మొన్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి అండదండలు అందించారు.

కాంగ్రెస్‌ గెలవడం కోసం తన పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా కట్టడి చేశారు చంద్రబాబు. సీఎం రమేశ్‌ రాజ్యసభ సభ్యత్వం మరికొన్ని రోజుల్లో ముగుస్తుంది. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే ఉన్నా, ఆయన ఇంకా తెలుగుదేశం పార్టీ మనిషే! టీడీపీ కోసం రమేశ్‌ ఏమైనా చేస్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రమేశ్‌ రిత్విక్‌ ప్రాజెక్ట్స్ సంస్థను మొదలుపెట్టారు. చంద్రబాబు అండదండలతోనే భారీ ఎత్తున కాంట్రాక్టులు సంపాదించారు. చంద్రబాబు కారణంగానే వేనవేల కోట్ల రూపాయలను ఆర్జించగలిగారు. 2019 ఏపీ ఎన్నికలలో చంద్రబాబు పార్టీ ఘోరంగా ఓడిపోయింది. పార్టీ ఓడిపోగానే సీఎం రమేశ్‌ను బీజేపీలోకి పంపించేశారు చంద్రబాబు. బీజేపీలో ఉన్న రమేశ్‌ బీజేపీకి మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు కానీ బీజేపీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్‌ ఖాతాలోకి 30 కోట్ల రూపాయలు వేశారు సీఎం రమేశ్‌.

ఇక్కడే తెలిసిపోతున్నది కదా సీఎం రమేశ్‌ ఎవరి మనిషో! ప్రస్తుతం చంద్రబాబు వాడుకుంటున్న వారందరిపైనా సీఎం రమేశ్‌ చల్లని చూపు ఉంటుంది. వారికి అవసరమైన ఖర్చులను రమేశే పెడుతున్నారట! చంద్రబాబుతో పాటు షర్మిల, పవన్‌ కల్యాణ్‌, ప్రశాంత్‌ కిశోర్‌లకు ప్రత్యేక విమానాలు సమకూరుస్తున్నది సీఎం రమేశే! తెలుగుదేశం తరఫున రాజ్యసభకు ఎన్నికైన రమేవ్‌ తర్వాత బీజేపీలో చేరారు. ఆ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్‌కు భారీగా నిధులివ్వడం ఆశ్చర్యం. మొన్నటికి మొన్న చంద్రబాబును ఢిల్లీలో బీజేపీ అధినాయకులు కలవడానికి కూడా ఇష్టపడలేదు. అప్పుడు రంగంలోకి దిగిన సీఎం రమేశ్‌ వెనుక నుంచి కథ నడిపించారు. ఎలాగోలా బీజేపీ అధిష్టానం అపాయింట్‌మెంట్లు సంపాదించి పెట్టారు. కీలక నేతలతో చంద్రబాబు సమావేశమయ్యేలా చేశారు. బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబుకు కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలనే కోరిక ఉంది.

అందుకే ఆ పార్టీకి రమేశ్‌తో నిధులిప్పించారు. కాంగ్రెస్‌కు రమేశ్‌ నిధులు ఇచ్చిన తర్వాత పరిణామాలు వేగంగా మారాయి. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసిన షర్మిల ఏపీలో ఆ పార్టీ అధ్యక్షరాలయ్యారు. అప్పట్నుంచి ఆమె తన సోదరుడు జగన్‌ను టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. రకరకాల విమర్శలు చేస్తున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి కూతురు సునీతమ్మకు అండగా నిలిచారు. వివేకాను హత్య చేయించింది జగనే అన్నట్టుగా కామెంట్‌ చేశారు. కడప లోక్‌సభ స్థానం నుంచి వివేకా భార్య సౌభాగ్యమ్మను కానీ, సునీతమ్మను కానీ పోటీ చేయించాలని ప్లాన్‌ వేశారు షర్మిల. అయితే చంద్రబాబు ఇచ్చిన సలహామేరకు ఇప్పుడామెనే బరిలో దిగాలని అనుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్‌తో తమకేమిటి సంబంధం అని చంద్రబాబు ఎదురు ప్రశ్నిస్తుంటారు. కాంగ్రెస్‌ పెద్దలు కూడా చంద్రబాబుతో దోస్తానా లేదని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఎలక్టొరల్‌ బాండ్ల వివరాలు బయటపడటంతో చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్టయ్యింది. కాంగ్రెస్‌ పార్టీకి సీఎం రమేశ్‌ సంస్థ 30 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది.

Updated On 23 March 2024 12:27 AM GMT
Ehatv

Ehatv

Next Story