దేశంలో నరేంద్రమోదీ(Narendra Modi) వేవ్ లేదు... ఈ మాట ఏ ప్రతిపక్షాల నేతలో అంటే లైట్ తీసుకోవచ్చు. కానీ ఈ కామెంట్ చేసింది మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణా(Navneet Rana). ఒకప్పటి సినీనటి అయిన నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అమరావతిలో జరిగిన ఓ సభలో ఆమె మాట్లాడుతూ 'గ్రామ పంచాయతీ ఎన్నికలలాగానే ఈ ఎన్నికల్లో కూడా పోరాటం సాగించాలి.

Navneet Rana
దేశంలో నరేంద్రమోదీ(Narendra Modi) వేవ్ లేదు... ఈ మాట ఏ ప్రతిపక్షాల నేతలో అంటే లైట్ తీసుకోవచ్చు. కానీ ఈ కామెంట్ చేసింది మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణా(Navneet Rana). ఒకప్పటి సినీనటి అయిన నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అమరావతిలో జరిగిన ఓ సభలో ఆమె మాట్లాడుతూ 'గ్రామ పంచాయతీ ఎన్నికలలాగానే ఈ ఎన్నికల్లో కూడా పోరాటం సాగించాలి. మధ్యాహ్నం 12 గంటల వరకల్లా ఓటు వేయించడానికి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించాలి. మోదీ వేవ్ ఉందనే భ్రమల్లో ఉండకండి. 2019లో మోదీ వేవ్ ఉంది. అయినప్పటికీ నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించాను' అని ఆమె చెప్పారు. 2019లో ఆమె పోటీ చేసినప్పుడు కాంగ్రెస్(Congress), ఎన్‌సీపీ(Congress) మద్దతు ఇచ్చాయి. అలా ఆమె విజయం సాధించారే తప్ప ఇండిపెండెంట్‌గా గెలిచేంత సీన్ ఆమెకు లేదు. గెలిచిన కొన్నాళ్లకే ఆమె కాంగ్రెస్, ఎన్‌సీపీలకు హ్యాండ్ ఇచ్చేసి బీజేపీలో చేరారు. ఈ విషయం అలా ఉంచితే మోదీ వేవ్ లేదంటూ నవనీత్ చేసిన వ్యాఖ్యలను మహా వికాస్ అఘాడీ సమర్థించింది. నవనీత్ నిజమే చెప్పారని, ఓటర్ల అభిప్రాయాలను ఆమె పసికట్టారని పేర్కొంది. ‘మోదీ వేవ్ మాట మరచిపోండి. మోదీ తాను పోటీ చేస్తున్న స్థానంలో విజయం సాధిస్తారా లేదా అన్నది కూడా అనుమానమే’ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) అన్నారు. తన వ్యాఖ్యలు వైరల్ కావడంతో నవనీత్ కౌర్ రాణా దిద్దుబాటు చర్యలకు దిగారు. తన ప్రసంగాన్ని ఎడిట్ చేసి తప్పుడు అర్థం వచ్చేలా చేశారని ఆమె ఆరోపించారు. తాను మోదీ వేవ్ లేదని అనలేదని వివరణ ఇచ్చుకున్నారు.
