మణిపూర్(Manipur) ఇంకా మండిపోతూనే ఉంది. భయానక పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మెయితీ తెగకు ఎస్టీ హోదా కల్పించకూడదంటూ ఆల్ ట్రైబల్(tribals) స్టూడెంట్స్(students) యూనియన్ మణిపూర్ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది.
మణిపూర్(Manipur) ఇంకా మండిపోతూనే ఉంది. భయానక పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. మెయితీ తెగకు ఎస్టీ హోదా కల్పించకూడదంటూ ఆల్ ట్రైబల్(tribals) స్టూడెంట్స్(students) యూనియన్ మణిపూర్ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. మెయితీ డిమాండ్‌తో గిరిజనులు భగ్గుమన్నారు. పలు చోట్ల ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పు పెట్టారు. ప్రార్థనామందిరాలపై దాడులకు దిగారు. గిరిజనేతరులతో గొడవ పెట్టుకున్నారు.
ప్రస్తుతం అక్కడ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. కర్ఫ్యూ(curfew) గుప్పిట ఎనిమిది జిల్లాలు బిక్కుబిక్కుమంటున్నాయి. హింసాకాండలో ఇప్పటికే పలువురు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర మంత్రి, బీజేపీ(BJP) నాయకుడు ఉంగ్జాగిన్ వాల్టేపై(Vungzagin Valte)నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం ఆయన ఇంఫాల్‌లోని(Imphal) రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో(Regional Institute of Medical Sciences) చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటుననారు. కూకి తెగకు చెందిన ఉంగ్జాగిన్ ధన్‌లోన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ప్రభుత్వంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు.
నిన్న ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్‌తో సెక్రటేరియట్‌లో సమావేశమైన ఉంగ్జాగిన్ తిరిగి తన అధికార నివాసానికి వెళుతున్నప్పుడు నిరసనకారులు ఆయనను అడ్డగించారు. ఆయనపై దాడికి దిగారు. ఉంగ్జాగిన్‌తో పాటు ఆయన డ్రైవర్‌ను కూడా ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. వారిద్దరు అతి కష్టం మీద అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.