ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) బీజేపీ(BJP) ఎమ్మెల్యేపై కోర్టు(Court) సంచలన తీర్పు ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్‌కు(Randular Gond) 25 ఏళ్ల శిక్ష విధిస్తూ సంచనల తీర్పు ఇచ్చింది. ఏడాది కాలంగా ఎమ్మెల్యే తనపై రేప్(rape) చేస్తున్నాడని 15 ఏళ్ల బాలిక 2014లో తన సోదరుడికి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

BJP Ramdular Gond
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) బీజేపీ(BJP) ఎమ్మెల్యేపై కోర్టు(Court) సంచలన తీర్పు ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్‌కు(Randular Gond) 25 ఏళ్ల శిక్ష విధిస్తూ సంచనల తీర్పు ఇచ్చింది. ఏడాది కాలంగా ఎమ్మెల్యే తనపై రేప్(rape) చేస్తున్నాడని 15 ఏళ్ల బాలిక 2014లో తన సోదరుడికి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సోన్‌భద్ర(Sonbhadra) జిల్లాలోని దుద్ది పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యేపై రేప్, పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మెల్యే రాందులర్ గోండ్‌ను దోషిగా నిర్ధారిస్తూ 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రూ. 10 లక్షల జరిమానా విధించారు. బాలిక కుంటానికి పరిహారంగా ఈ 10 లక్షలను ఉపయోగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు వెలువడే ముందు గోండ్ తరపు న్యాయవాది కనీస శిక్ష విధించాలని కోర్టును కోరారు. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని గోండ్ పూర్తిగా ఆదుకుంటారని ఆయన కోర్టుకు హామీ ఇచ్చారు. నేరం జరిగినప్పుడు గోండ్ ఎమ్మెల్యేగా లేరు. మరోవైపు రాందులర్ గోండ్‌పై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ అనర్హత వేటు వేసింది. ఈ తీర్పు ఉత్తరప్రదేశ్‌లో సంచలనంగా మారింది.
