Raja Singh : రాజాసింగ్ పోటీ ఎక్కడి నుంచి...?
రాజాసింగ్‌పై(Raja Singh) సస్పెన్షన్(Suspension) ఎత్తివేస్తూ బీజేపీ(BJP) అధిష్టానం ప్రకటన జారీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని గత ఏడాది ఆగస్ట్‌న రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్ చేసింది. బీజేపీ నేతలు, కార్యకర్తల తీవ్ర ఒత్తిడి మేరకు ఎట్టకేళకు రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేసింది బీజేపీ అధిష్టానం.

అయితే గోషామహల్(Goshmahal) టికెట్‌ను మాజీ మంత్రి ముఖేష్ గౌడ్(Mukesh Goud) కుమారుడు విక్రమ్‌గౌడ్(Vikram Goud) ఆశిస్తున్నారు. గత కొంతకాలంగా విక్రమ్‌గౌడ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. అధిష్టానం ఆదేశాల ప్రకారం గోషామహల్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు విక్రమ్‌గౌడ్ చేపట్టారు. రాజాసింగ్ సస్పెండ్‌తో ఈ నియోజకవర్గంపై విక్రమ్‌గౌడ్ ఆశలు పెంచుకున్నాడు. తాజాగా రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో, గోషామహల్ నుంచి రాజాసింగే మళ్లీ పోటీ చేయనున్నారా? అనే విషయం స్పష్టత రావాల్సి ఉంది. రాజాసింగ్‌కు గోషామహల్ టికెటే కేటాయిస్తే విక్రమ్‌గౌడ్ పరిస్థితి ఏంటి, విక్రమ్‌గౌడ్‌ను ఎక్కడ అకామిడేట్ చేస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది.
రాజిసింగ్‌నే మరో చోటుకి మార్చాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. గతంలోనూ రాజాసింగ్ బీజేపీ(BJP) అధిష్టానానికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తే చాలు, అధిష్టానం ఎక్కడి నుంచి పోటీచేయమన్నా చేస్తా లేదంటే ఇంట్లోనే కూర్చుంటా కానీ సెక్యులర్ పార్టీల్లో చేరనని ప్రకటించాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాజాసింగ్ సీటును మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజాసింగ్‌ను కార్వాన్ లేదా మలక్‌పేట(Malakpet) నియోజకవర్గంలో పోటీ చేయించాలని అనుకుంటున్నట్లు సమాచారం. విక్రమ్‌గౌడ్‌కు గోషామహల్ సీటు ఇచ్చి రాజాసింగ్‌ను మరోచోటుకు మార్చాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు తర్వాతే బీజేపీ లిస్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.