ఓ ఎమ్మెల్యేను ఓ ఐఏఎస్ అధికారిణి మనువాడబోతున్నారు. డిసెంబర్ 22న వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగబోతున్నది. ఇందులో గొప్పేమిటనుకుంటున్నారా? గొప్పే మరి! గ్రాండ్‌గా అంటే మామూలు గ్రాండ్‌గా కాదు.. ఆకాశమంత పందరి వేసి, భూదేవంత పీట వేసి పెళ్లి జరిపించారంటారు కదా! ఆ అతిశయోక్తిని ఇంచుమించుగా నిజం చేసేలా వైభవోపేతంగా జరగనుంది. ఆ ఎమ్మెల్యే ఎవరంటే హర్యానాకు చెందిన భవ్య బిష్ణోయ్(BJP MLA Bhavya Bishnoi).. ఈయన మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు.
ఓ ఎమ్మెల్యేను ఓ ఐఏఎస్ అధికారిణి మనువాడబోతున్నారు. డిసెంబర్ 22న వీరి పెళ్లి గ్రాండ్‌గా జరగబోతున్నది. ఇందులో గొప్పేమిటనుకుంటున్నారా? గొప్పే మరి! గ్రాండ్‌గా అంటే మామూలు గ్రాండ్‌గా కాదు.. ఆకాశమంత పందరి వేసి, భూదేవంత పీట వేసి పెళ్లి జరిపించారంటారు కదా! ఆ అతిశయోక్తిని ఇంచుమించుగా నిజం చేసేలా వైభవోపేతంగా జరగనుంది. ఆ ఎమ్మెల్యే ఎవరంటే హర్యానాకు చెందిన భవ్య బిష్ణోయ్(BJP MLA Bhavya Bishnoi).. ఈయన మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు. పెళ్లి కూతురు ఎవరంటే ఐఏఎస్ అధికారిణి పరి బిష్ణోయ్(IAS Pari Bishnoi)! వీరి వివాహానికి ఢిల్లీ(Delhi)తో పాటు రెండు రాష్ట్రాలకు ఆహ్వానాలు వెళ్లాయి. రాజస్థాన్(Rajastan)లోని ఉదయ్‌పూర్(Udaipur)లో పెళ్లి జరుగుతుంది. పుష్కర్, అదంపుర్, ఢిల్లీ నగరాలలో రిసెప్షన్‌లు జరగనున్నాయి. ఈ మూడు నగరాలు రెసెప్షన్లకు వేదిక కాబోతున్నాయి. మూడు లక్షల మందికి ఆహ్వానాలు వెళ్లనున్నాయి. భవ్య బిష్ణోయ్-పరి బిష్ణోయ్ ఎంగేజ్‌మెంట్ ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగింది. ఆదంపుర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భవ్య తండ్రి కులదీప్ బిష్ణోయ్ బీజేపీ నేత, మాజీ ఎంపీ. తాత గురించి ముందే చెప్పుకున్నాం కదా! ఇక వధువు విషయానికి వస్తే ఆమెది రాజస్థాన్. 2019లో సివిల్స్ సాధించిన పరి బిష్ణోయ్ ప్రస్తుతం సిక్కిం క్యాడర్ కింద గ్యాంగ్‌టక్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. వధువుది రాజస్థాన్ కాబట్టి ఆ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి జరగనుంది. అలాగే ఆ రాష్ట్రంలోనే ఉన్న పుష్కర్ నగరంలో ఒక రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. భజన్‌లాల్ కాలం నుంచి అదంపుర్‌లో బిష్ణోయ్ కుటుంబానికి పట్టుంది. ఈ నియోజకవర్గంలోని 80కి పైగా గ్రామాల ప్రజలను పెళ్లికి ఆహ్వానిస్తామిన కుల్‌దీప్ బిష్ణోయ్ తెలిపారు. ‘నా తండ్రి భజన్‌లాల్ కూడా నా వివాహం సమయంలో అన్ని ఊర్లు తిరిగి ప్రజలను ఆహ్వానించారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు నేనూ అదే చేయబోతున్నాను' అని కుల్‌దీప్ తెలిపారు. ఢిల్లీలో జరిగే రిసెప్షన్‌కు పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖులు హాజరవుతారన్నారు. అన్నట్టు భవ్య బిష్ణోయ్‌కు 2021లో సినీ నటి మెహ్రీన్ పిర్జాదాతో నిశ్చితార్థం జరిగింది. అయితే కొద్దినెలలకే వారి ఎంగేజ్‌మెంట్ రద్దయింది. మెహ్రీన్ తెలుసు కదా! మన తెలుగులో కూడా కృష్ణగాడి వీర ప్రేమగాథ, రాజా ది గ్రేట్, జవాన్,ఎఫ్ 2, మంచిరోజులు వచ్చాయి తదితర సినిమాలలో నటించారు.