భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేడు కర్ణాటకలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయ‌నుంది. అసెంబ్లీ ఎన్నికలైన‌ చాలా కాలం తర్వాత.. ఈరోజు ఆ పార్టీ ప్రతిపక్ష నేత పేరును ఖరారు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మే 13న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 66 సీట్లకే ప‌రిమిత‌మైంది.

భారతీయ జనతా పార్టీ (BJP) నేడు కర్ణాటక(Karnataka)లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయ‌నుంది. అసెంబ్లీ ఎన్నికలైన‌(Assembly Elections) చాలా కాలం తర్వాత.. ఈరోజు ఆ పార్టీ ప్రతిపక్ష నేత(Opposition Leader) పేరును ఖరారు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మే 13న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్(Congress) 135 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 66 సీట్లకే ప‌రిమిత‌మైంది.

సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రతిపక్ష నేత ఎంపిక జరుగుతుందని, అయితే బీజేపీలో మాత్రం ఏకాభిప్రాయం, అసమ్మతి కొన‌సాగుతున్నాయని పార్టీ నేతలు అంటున్నారు. దీంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం, అంతర్గత విభేదాల కారణంగా ప్రతిపక్ష నేత ఎంపికలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు చాలా కాలం తర్వాత ప్రతిపక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈరోజు ప్రతిపక్ష నేత పేరుపై ఏకాభిప్రాయం కుదరుతుందన్న ధీమాను ఆ పార్టీ వ్యక్తం చేస్తోంది.

ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్(Nalin Kumar), కర్ణాటక ఇంచార్జి అరుణ్ సింగ్(arun Singh), కేంద్ర పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడ్యూరప్ప సహా ప్రముఖులు హాజరుకానున్నారు. ప్రతిపక్ష నేతగా బసవరాజ్‌ బొమ్మై(Basavaraj Bommai), బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌, అశ్వత్నారయణ్‌, వి సునీల్‌ కుమార్‌(Sunil Kumar), ఆర్‌ అశోక్‌(Ashok) వంటి పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ అంతర్గత వ్య‌వ‌హారాల‌లో కీల‌క భూమిక పోషించే నేత‌ల నుంచి స‌మాచారం. వీరే కాకుండా.. శ్రీనివాస పూజారి(Srinivasa Pujari), తేజస్విని గౌడ(Tejaswini Gouda), చలువాది నారాయణ స్వామి(Chaluvadi Narayanaswamy) పేర్లు కూడా చర్చకు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి కారణమైన 11 మంది నేతలను అధిష్టానం గుర్తించిందని ఓ నేత చెబుతున్నారు. ఈరోజు జరిగే సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు రానుంది. అదే సమయంలో శుక్రవారం కూడా ఈ అంశంపై సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇందులో యడ్యూరప్ప, బొమ్మై, కటీల్, ప్రహ్లాద్ జోషి, సీటీ రవి సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు. క్రమశిక్షణా రాహిత్యంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు నేతలను వారు కలిశారు.

క్రమశిక్షణా రాహిత్యం, వివాదాస్పద వ్యాఖ్యలకు పాల్పడిన 11 మంది నాయకుల్లో ఎంపీలు రేణుకాచార్య, బసనగౌడ పాటిల్ యత్నాల్, మురుగేష్ నిరాణి, ప్రభు చౌహాన్, ప్రతాప్ సింహా, రమేష్ జిగజినాగి, దాసరహళ్లి మునిరాజు, ఏఎస్ నాదహల్లి, చరణాతి గౌడ్, ఈశ్వర్ గౌడ్, సింగ్ ఠాకూర్ ఉన్నారు. ఈ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, అయితే సమస్యల పరిష్కారానికి, పార్టీ ఐక్యతను మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని కొందరు హామీ ఇవ్వడంతో పార్టీ తన వైఖరిని మార్చుకుందని వర్గాలు చెబుతున్నాయి.

Updated On 1 July 2023 11:11 PM GMT
Yagnik

Yagnik

Next Story