భారతీయ జనతాపార్టీని(BJP) బిజూ జనతాదళ్ దూరం పెట్టేసినట్టే! బీజేపీ-బీజేడీ(BJD) మధ్య పొత్తు(Alliance) పొడిచిందని, వచ్చే ఎన్నికల్లో(Elections) కలిసి పోటీ చేస్తాయని బోల్డన్నీ కథనాలు వచ్చాయి. 15 ఏళ్ల తర్వాత రెండు పార్టీలు మళ్లీ ఒక్కటవ్వుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే పొత్తు లేనట్టేనని తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra modi) ఒడిశాలో(Odisha) పర్యటించారు.
భారతీయ జనతాపార్టీని(BJP) బిజూ జనతాదళ్ దూరం పెట్టేసినట్టే! బీజేపీ-బీజేడీ(BJD) మధ్య పొత్తు(Alliance) పొడిచిందని, వచ్చే ఎన్నికల్లో(Elections) కలిసి పోటీ చేస్తాయని బోల్డన్నీ కథనాలు వచ్చాయి. 15 ఏళ్ల తర్వాత రెండు పార్టీలు మళ్లీ ఒక్కటవ్వుతున్నాయని వార్తలు వచ్చాయి. అయితే తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే పొత్తు లేనట్టేనని తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra modi) ఒడిశాలో(Odisha) పర్యటించారు. ఆ పర్యటనలో మోదీ, బీజేడీ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్(naveen patnayak) మంతనాలు జరిపారు. ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ పొత్తు కోసమేనని అందరూ అనుకున్నారు. మరి ఏమైందో ఏమో ఈసారి బీజేపీ ఒంటరిగానే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. బహుశా సీట్ల పంపకాల్లో విభేదాలు తలెత్తాయని, అందుకే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్(Manmohan Samal) తెలిపారు. బీజేపీ అధినాయకత్వం పిలుపుతో మన్మోహన్ సాముల్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో(Amit shah) సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చల తర్వాత అధినాయకత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు మరోవైపు బీజేడీ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన నివాసంలో పార్టీ సీనియర్ నేతల సమావేశాన్ని నిర్వహించారు. చర్చల సారాంశమేమిటో బయటకు రాలేదు కానీ ప్రజలలో మాత్రం పొత్తుపై ఆసక్తి పెరిగింది.