మహారాష్ట్రకు(Maharastra) చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే(Lady MLA) సివిల్‌ ఇంజనీర్‌పై(Civil Engineer) చేయి చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అందరి ముందు ఇంజనీర్‌ చెంప చెళ్లుమనిపించారా ఎమ్మెల్యే. సోషల్‌ మీడియాలో(social Media) వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుననారు. థానే జిల్లా మీరా భయందర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు.

మహారాష్ట్రకు(Maharastra) చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే(Lady MLA) సివిల్‌ ఇంజనీర్‌పై(Civil Engineer) చేయి చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అందరి ముందు ఇంజనీర్‌ చెంప చెళ్లుమనిపించారా ఎమ్మెల్యే. సోషల్‌ మీడియాలో(social Media) వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుననారు. థానే జిల్లా మీరా భయందర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు. ఇందులో భాగంగానే కాషిమిరాలోని(Kshmir) పెంకర్‌ పెడా ప్రాంతంలో ఉన్న అక్రమ నిర్మాణాలను ఇంజనీర్‌లు శుభమ్‌ పాటిల్‌(shubam patel), సోనీ(Sony) ఆధ్వర్యంలో కూల్చివేశారు. విషయం తెలుసుకున్న మీరా భయందర్‌ ఎమ్మెల్యే గీతా జైన్‌ అక్కడికి వచ్చారు. ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. నిర్మాణాలను ఎలా కూలుస్తారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో కాంట్రాక్ట్‌ పద్దతిన పని చేస్తున్న జూనియర్‌ సివిల్‌ ఇంజనీర్‌ శుభమ్ పాటిల్‌పై చేయి చేసుకున్నారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తే తప్పేమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఇంజనీర్‌పై చేయి చేసుకున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే తను చేసింది కరెక్టేనని ఎమ్మెల్యే చెప్పుకోవడం.

Updated On 21 Jun 2023 4:39 AM GMT
Ehatv

Ehatv

Next Story