ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) కొత్త ముఖ్యమంత్రిని(chief Minister) ఎంపిక చేసేందుకు శనివారం బీజేపీ(BJP) లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయిని(CM Vishnudeo Sai) ఎంపిక చేశారు. కుంకూరి(Kunkuri) అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన‌ ఎమ్మెల్యే విష్ణుదేవ్ సాయి గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు. 15 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన ర‌మ‌ణ్ సింగ్‌ను ప‌క్క‌న‌బెట్టి విష్ణుదేవ్ సాయి పేరును ప్ర‌క‌టించి బీజేపీ అధిష్టానం అంద‌రినీ ఆశ్య‌ర్య‌పరిచింది.

ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) కొత్త ముఖ్యమంత్రిని(chief Minister) ఎంపిక చేసేందుకు శనివారం బీజేపీ(BJP) లెజిస్లేచర్ పార్టీ( legislature party) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయిని(CM Vishnudeo Sai) ఎంపిక చేశారు. కుంకూరి(Kunkuri) అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన‌ ఎమ్మెల్యే విష్ణుదేవ్ సాయి గిరిజన సామాజిక వర్గానికి చెందినవారు. 15 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన ర‌మ‌ణ్ సింగ్‌ను ప‌క్క‌న‌బెట్టి విష్ణుదేవ్ సాయి పేరును ప్ర‌క‌టించి బీజేపీ అధిష్టానం అంద‌రినీ ఆశ్య‌ర్య‌పరిచింది.

బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఓం మాథుర్, మన్సుఖ్ మాండవ్యతో పాటు ముగ్గురు పరిశీలకులు, కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. రాయ్‌పూర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో కలిసి విష్ణుదేవ్ సాయి పేరును ఆమోదించారు.

ఛత్తీస్‌గఢ్‌కు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న విష్ణుదేవ్ సాయి నాలుగుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా, రెండుసార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా ప‌నిచేశారు. కుంకూరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో ఆయన 25,541 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని 90 సీట్లకు గాను బీజేపీ 54 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 35 సీట్లకే పరిమితమైంది.

Updated On 10 Dec 2023 6:19 AM GMT
Ehatv

Ehatv

Next Story