ఈటల రాజేంద్ర(Etala Rajendra), ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) ల కి Y +, Y సెక్యూరిటీ(Security) పెంచిన కేంద్రం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఇదే పెద్ద టాపిక్. అసలు ఇంతకీ Y +, Y సెక్యూరిటీ అంటే ఏంటి? మన దేశంలో ఎన్నిరకాల సెక్యూరిటీ ఉంటుంది? అవి ఎవరికీ ఇస్తారు. తెలుసుకోవాలనుందా. 

ఈటల రాజేంద్ర(Etala Rajendra), ధర్మపురి అరవింద్(Dharmapuri Arvind) ల కి Y +, Y సెక్యూరిటీ(Security) పెంచిన కేంద్రం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఇదే పెద్ద టాపిక్. అసలు ఇంతకీ Y +, Y సెక్యూరిటీ అంటే ఏంటి? మన దేశంలో ఎన్నిరకాల సెక్యూరిటీ ఉంటుంది? అవి ఎవరికీ ఇస్తారు. తెలుసుకోవాలనుందా.

ప్రముఖులకుండే ప్రమాదాలను అంచనా వేసిన తర్వాత, భద్రతా వర్గాన్ని ఐదు గ్రూపులుగా విభజించి ప్రమాద అంచనాని బట్టి వారికీ కేటాయిస్తారు. అలా ప్రమాద స్థాయిని పట్టి X, Y, Z, Z+, SPG గ్రూపులుగా భద్రతని వర్గీకరించారు.
ఇటువంటి భద్రత VIPలు , VVIPలు ఇతర ఉన్నత స్థాయి లేదా రాజకీయ ప్రముఖులకు అందిస్తారు. దీంట్లో Z+ అనేది అత్యున్నత స్థాయి రక్షణ అయితే, దేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులు, ప్రస్తుత, మాజీ ప్రధానులు(Ex-PM) ఇతర ముఖ్య నాయకులకి ఇస్తారు.
ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు (PSO) ఉండే వై కేటగిరీకి 11 మందికి శాశ్వత గార్డును కేటాయించారు.ఇప్పడు ఈ ఐదు కేటగిరులలో రక్షణ సిబ్బంది ఎలా ఉంటారో చూద్దాం.

X స్థాయి భద్రత:
ఇది భారతదేశం లో ఐదవ అత్యుత్తమ భద్రతా స్థాయి, ఈ కేటగిరిలో ఇద్దరు భద్రతా సిబ్బంది ఉంటారు , వీరిద్దరూ సాయుధ పోలీసు అధికారులు. షిఫ్ట్ కి ఒకరు చప్పున ఉంటారు. ఈ సెక్యూరిటీ దేశవ్యాప్తంగా అనేక మందికి అందించబడుతుంది.

Y స్థాయి భద్రత:
ఇది భారతదేశంలో నాల్గవ భద్రతా స్థాయి, ఈ కేటగిరిలో 11 మంది భద్రతా సిబ్బంది ఉంటారు , ఇందులో 1-2 NSG కమాండోలు మిగిలిన వారు పోలీసు సిబ్బంది ఉంటారు. ఇందులో ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు.

Z స్థాయి భద్రత:
Z కేటగిరి సెక్యూరిటీ లో 4-5 గురు NSG కమాండోలు + పోలీసు సిబ్బందితో కూడిన 22-సభ్యుల సిబ్బంది ఉంటారు. ఇది దేశంలో మూడవ-అత్యున్నత స్థాయి భద్రత.

ఇందులో ఢిల్లీ పోలీస్, ఇండో-టిబెటన్ పోలీస్ (ITBP),CRPF సభ్యుల Z స్థాయి రక్షణతో పాటు ఎస్కార్ట్ కారును కేటాయిస్తారు.
బాబా రామ్దేవ్, నటుడు అమీర్ ఖాన్లకు Z భద్రతను కేటాయించారు.

Z+ స్థాయి భద్రత:
ఇది రెండవ అత్యున్నత స్థాయి భద్రతా రక్షణను కలిగి ఉంటుంది . ఈ భద్రతా కవరేజ్లో 10+ NSG కమాండోలు, పోలీసు అధికారులను కలిగి ఉన్న 55-వ్యక్తుల రక్షణ ఉంటుంది.
ఇందులోని ప్రతి కమాండో మార్షల్ ఆర్ట్స్ , నిరాయుధ పోరాట శిక్షణ పొందిన నిపుణులైన ఉంటారు. అంటే అవసరాన్ని బట్టి ఒంటి చేత్తో ప్రత్యర్థుల్ని హతం చేయగలుగుతారు.
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆర్థిక మంత్రి తదితర ప్రముఖులకు ఈ భద్రత కల్పించారు.

SPG స్థాయి భద్రత:
ఇది దేశంలోనే అత్యుతమ భద్రత. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రస్తుతం దేశ ప్రధాని మోడీ కి మాత్రమే ఉంది. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ లకి 2019 వరకు ఈ భద్రత ఉండేది. భారతదేశ ప్రధానమంత్రి, భారత మాజీ ప్రధానులు వారి కుటుంబ సభ్యులకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోటా ఈ స్థాయి భద్రత కల్పించబడుతుంది , మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణం తరువాత, ఈ స్థాయి రక్షణ వ్యవస్థని రూపొందించారు.

Updated On 10 July 2023 4:52 AM GMT
Ehatv

Ehatv

Next Story