Kamiya Jani : జగన్నాథుడి మహాప్రసాదంపై యూట్యూబర్ వీడియో, రచ్చ చేస్తున్న బీజేపీ
సోషల్ మీడియాలో(Social media) యాక్టివ్‌గా ఉండేవారికి కామియా జాని(Kamiya Jani) సుపరిచితమే! యూ ట్యూబ్‌లో కర్లీ టేల్స్ పేరిట ఆమె పోస్ట్ చేసే వీడియోలకు బ్రహ్మండమైన వ్యూవర్‌షిప్ ఉంటుంది. కంటెంట్ కూడా ఇంట్రస్టింగ్‌గానే ఉంటుంది. ఆమెకు ఫాలోవర్స్ కూడా ఎక్కువే! మొన్న కామియా ఓ వీడియో పెట్టింది.
సోషల్ మీడియాలో(Social media) యాక్టివ్‌గా ఉండేవారికి కామియా జాని(Kamiya Jani) సుపరిచితమే! యూ ట్యూబ్‌లో కర్లీ టేల్స్ పేరిట ఆమె పోస్ట్ చేసే వీడియోలకు బ్రహ్మండమైన వ్యూవర్‌షిప్ ఉంటుంది. కంటెంట్ కూడా ఇంట్రస్టింగ్‌గానే ఉంటుంది. ఆమెకు ఫాలోవర్స్ కూడా ఎక్కువే! మొన్న కామియా ఓ వీడియో పెట్టింది. భక్తి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఒడిశా(Odisha) ప్రభుత్వం పూరి శ్రీమందిర్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు చేపట్టింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజకీయవారసుడు వీకే పాండ్యన్ ఈ ప్రాజెక్టుకు హెడ్!ఆయనను ఆలయ(Temple) ప్రాంగణంలో కూర్చొబెట్టి పూరి మహాప్రసాదం(Mahaprasadam) విశిష్టత మీద కామియా జాని చేసిన వీడియో అది! అది బాగా వైరల్ అయ్యింది. నిజానికి హిందుమతం, సనాతన ధర్మం అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చే భారతీయ జనతా పార్టీ(BJP) దీనికి సపోర్ట్ చేయాలి. కానీ అలా చేయకుండా నానా యాగీ చేసింది. బీఫ్(Beef) తినే ఆమెను పూరి గుడిలోకి ఎలా రానిచ్చారు? రానిస్తే రానిచ్చారు.. ఆమె మహాప్రసాదం మీద వీడియో చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు అంటూ విమర్శలు చేయడం మొదలు పెట్టింది. అక్కడితో ఆగిందా? లేదు.. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయట! మతభావాలు డ్యామేజ్ అయ్యాయట! ఆలయ ప్రాంగణంలో షూట్ చేసి వీడియోను ప్రసారం చేయడం వల్ల ఆలయ ప్రతిష్ట మంటకలిసిందని మండిపడింది. పాండ్యన్‌పై, కామియా జానిపై ఐపీసీ సెక్షన్ 295 ఎ కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆమె చేసిన వీడియో ముఖ్యం కానీ ఆమె ఏం తింటే బీజేపీకేమిటి? అన్నది కామన్‌మన్ ప్రశ్న. ఆమె చాలా పద్దతిగా చక్కటి దుస్తులు ధరించి, ఆలయ ప్రాంగణంలో అన్ని మర్యాదలు పాటించి, ఆలయ మహా ప్రసాదం విశిష్టత మీద వీడియో చేస్తే బీజేపీకి నొప్పి ఎందుకు? అని కొందరు అడుగుతున్నారు. ఒకవేళ ఆమెకు బీఫ్ తినే అలవాటు ఉందే అనుకుందాం! అది ఆమె పర్సనల్ కదా! అని బీజేపీని నిలదీస్తున్నారు. రెండు రోజులుగా మరే ఇష్యూ లేనట్టుగా బీజేపీ దీన్నే పట్టుకుని ఉండటంతో కామియా జాని వివరణ ఇచ్చుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. 'అయ్యల్లారా...నేను నా జీవితంలో ఇంత వరకు బీఫ్ తినలేదు. ఓ భారతీయురాలిగా తమన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చెప్పాలన్నదే నా అభిమతం. నా అలవాటు. నా అభిరుచి. అందుకే జ్యోతిర్లింగాలను సందర్శిస్తున్నాను. చార్ థామ్ కూడా వెళ్లాను. ఎక్కడ విశిష్ట ఆలయం ఉందో అక్కడికి వెళతాను. నేను పూరికి వెళ్లడాన్ని ఆక్షేపిస్తూ ఎవరో ఏదో రాశారు, నన్ను ముందే అడిగితే వివరణ ఇచ్చుకునేదాన్ని… జై జగన్నాథ్' అని రాసుకొచ్చారు. నవీన్ పట్నాయక్ మీద ఆరోపణలు, విమర్శలు చేయడానికి ఏమీ దొరకవు. అందుకే ఎప్పుడు టైమ్ దొరుకుతుందా అని బీజేపీ కాచుక్కూర్చుంటుంది. ఈ ఇష్యూను పట్టుకుని రచ్చ రచ్చ చేసింది. అయినా బీఫ్ అంటే గోమాంసమేనా? ఇది కూడా తెలియకుండా బీజేపీ చేస్తున్న రాద్దాంతాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు.