బీహార్‌లోని(Bihar) మాధేపురా జిల్లాలో జేడీయూ(JDU) నేత సంజయ్ కుమార్ భగత్‌పై(Sanjay Kumar Baghat)బీజేపీ(BJP) నేత పంకజ్ పటేల్(Pankaj Patel) కాల్పులు(firing) జరిపారు. సంజయ్ భగత్ నడుము(Waist) భాగంలో కాల్చారు. ఘటన అనంతరం ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు..

Pankaj Patel
బీహార్‌లోని(Bihar) మాధేపురా జిల్లాలో జేడీయూ(JDU) నేత సంజయ్ కుమార్ భగత్‌పై(Sanjay Kumar Baghat)బీజేపీ(BJP) నేత పంకజ్ పటేల్(Pankaj Patel) కాల్పులు(firing) జరిపారు. సంజయ్ భగత్ నడుము(Waist) భాగంలో కాల్చారు. ఘటన అనంతరం ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. బీజేపీ నేత పంకజ్ పటేల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే బీజేపీ నేత ఎందుకు కాల్పులు జరిపాడనే విషయంపై స్పష్టత లేదు. జేడీయూ నేత సంజయ్‌కుమార్ భగత్‌తో బీజేపీ నేత పంకజ్ పటేల్ ఏదో ఒక అంశంపై వాగ్వాదానికి(quarrel) దిగారని.. ఆ తర్వాత కాల్పులు జరిగాయని చెబుతున్నారు.
బీజేపీ నేత పంకజ్ పటేల్ మాధేపురా జిల్లా లోక్‌సభ ఇన్‌ఛార్జ్. జేడీయూకు చెందిన సంజయ్ కుమార్ భగత్ మురళిగంజ్ నగర్ పంచాయతీ ఎన్నికలో పోటీ చేశారు. అయితే ఎన్నికలలో ఆయన ఓటమి పాలయ్యారు. సమాచారం మేరకు ఆదివారం ఉదయం జిల్లాలోని మురళీగంజ్ భగత్ ధర్మశాలలో బీజేపీ నేతల సమావేశం జరగాల్సి ఉంది. ఇందులో మాజీ డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ కూడా పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం మొదలైంది. దీంతో బీజేపీ నాయకుడు పంకజ్ తన లైసెన్స్ పిస్టల్ తో కాల్పులకు దిగాడు. జేడీయూ నేత సంజయ్ భగత్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఘటన అనంతరం అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
