ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే భారతీయ జనతాపార్టీ నేత కైలాశ్ విజయ్‌వర్గీయ (Kailash Vijayvargiya)) ఇప్పుడు మహిళల దుస్తులపై నోరుపారేసుకున్నారు. సరైన దుస్తులు ధరించని ఆడవాళ్లను శూర్పణఖతో ఆయన పోల్చారు. హనుమాన్ జయంతి (hanuman jayanthi)సందర్భంగా ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విజయ్ వర్గీయ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మహిళల వస్త్రధారణ చూసిన తర్వాత వారిలో దేవతలు అసలు కనిపించడం లేదన్నారు. 'హనుమాన్ జయంతి నాడు అబద్ధం చెప్పను. నేను నిజమే చెబుతున్నాను.
ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే భారతీయ జనతాపార్టీ నేత కైలాశ్ విజయ్‌వర్గీయ (Kailash Vijayvargiya)) ఇప్పుడు మహిళల దుస్తులపై నోరుపారేసుకున్నారు. సరైన దుస్తులు ధరించని ఆడవాళ్లను శూర్పణఖతో ఆయన పోల్చారు. హనుమాన్ జయంతి (hanuman jayanthi)సందర్భంగా ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విజయ్ వర్గీయ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మహిళల వస్త్రధారణ చూసిన తర్వాత వారిలో దేవతలు అసలు కనిపించడం లేదన్నారు. 'హనుమాన్ జయంతి నాడు అబద్ధం చెప్పను. నేను నిజమే చెబుతున్నాను. ఆడపిల్లలు వేసుకునే దుస్తులను చూసిన తర్వాత వారిని దేవతలుగా భావించలేము' అని వ్యాఖ్యానించారు.
రాత్రిపూట తాను పని మీద బయటకు వెళ్లినప్పుడు మద్యం మత్తులో ఉన్న యువతీయువకులను చూస్తుంటానని, అప్పుడు నాకు వారి చెంపలు వాయించాలన్నంత కోపం వస్తుందని అన్నారు. సరైన బట్టలు వేసుకోని అమ్మాయిలను తప్పపట్టారు. మహిళలను దేవతలుగా ఆరాధించే దేశంలో ఉన్నామని చెప్పారు. సంప్రదాయ దుస్తులను ధరించని ఆడవాళ్లలో ఆ ఆనవాళ్లు ఉండవని చెప్పారు. అలాంటి వారు శూర్పణఖలా కనిపిస్తారని కైలాశ్ విజయ్‌వర్గీయ అన్నారు. "దేవుడు మీకు మంచి శరీరాన్ని ఇచ్చారు. అంచేత మంచి దుస్తులు వేసుకోవాలి. పిల్లలకు మంచి బుద్ధులు నేర్పాలి' అని అమ్మాయిలకు హితవు చెప్పారు. బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. నెటిజన్లు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఎలాంటి దుస్తులు ధరించాన్నది మహిళల ఇష్టమని, ఇందులో మీ జోక్యం ఏమిటని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.