పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress) అధినేత్రి మమతా బెనర్జీపై(Mamatha banerjee) బీజేపీ(BJP) నాయకుడు దిలీప్ ఘోష్(Dilip Ghosh) అనకూడని మాట అన్నారు. బెంగాల్ కూతురునని చెప్పుకుంటున్న మమతా బెనర్జీ తన తండ్రి ఎవరో ముందు నిర్ణయించుకోవాలన్నారు. దిలీప్ ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'గోవాకు వెళ్లినప్పుడు మమతాబెనర్జీ గోవా బిడ్డనంటుంది. త్రిపురకు వెళ్లినప్పుడు త్రిపుర బిడ్డనంటుంది.

Mamatha Banerjee
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(Trinamool Congress) అధినేత్రి మమతా బెనర్జీపై(Mamatha banerjee) బీజేపీ(BJP) నాయకుడు దిలీప్ ఘోష్(Dilip Ghosh) అనకూడని మాట అన్నారు. బెంగాల్ కూతురునని చెప్పుకుంటున్న మమతా బెనర్జీ తన తండ్రి ఎవరో ముందు నిర్ణయించుకోవాలన్నారు. దిలీప్ ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్(Social media) మీడియాలో వైరల్ అవుతోంది. 'గోవాకు వెళ్లినప్పుడు మమతాబెనర్జీ గోవా బిడ్డనంటుంది. త్రిపురకు వెళ్లినప్పుడు త్రిపుర బిడ్డనంటుంది. అసలు తన తండ్రి ఎవరో ముందు ఆమె నిర్ణయించుకోవాలి' అని దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. ఆయన అన్న మాటలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆయన నోరు మంచిది కాదని, ఇంతకు ముందు దుర్గా మాతపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడేమో మమతపై వివదాస్పద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు నైతికంగా ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమని తృణమూల్ కాంగ్రెస్ నేతలు అన్నారు. 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ వాడిన బెంగాల్ వాంట్స్ టు గో విత్ డాటర్ నినాదం జనాల్లోకి చొచ్చుకుపోయింది. ఆ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే!
