బీజేపీ(BJP) ఐటీ సెల్‌, పెయిడ్‌ ముఠా అంటే రెండు రూపాయల కోసం కక్కుర్తి పడే బ్యాచ్‌ ఎంతకు దిగజారిపోయిందంటే, చివరికి మహిళా రెజ్లర్ల(Wrestlers) ఫోటోలను కూడా మార్ఫింగ్‌ చేసి శునకానందం పొందేటంతగా! మహిళా రెజ్లర్ల పరువు తీయడానికి మార్ఫింగ్‌ చేశారు. ఆ బ్యాచ్‌కు కొంచెమైనా సిగ్గుండాలి!

బీజేపీ(BJP) ఐటీ సెల్‌, పెయిడ్‌ ముఠా అంటే రెండు రూపాయల కోసం కక్కుర్తి పడే బ్యాచ్‌ ఎంతకు దిగజారిపోయిందంటే, చివరికి మహిళా రెజ్లర్ల(Wrestlers) ఫోటోలను కూడా మార్ఫింగ్‌ చేసి శునకానందం పొందేటంతగా! మహిళా రెజ్లర్ల పరువు తీయడానికి మార్ఫింగ్‌ చేశారు. ఆ బ్యాచ్‌కు కొంచెమైనా సిగ్గుండాలి! ఓ పక్క పార్లమెంట్‌ నూతన భవనం మోదీ చేతులు మీదుగా ప్రారంభోత్సవం జరుగుతున్న సమయంలోనే మరోపక్క మహిళా రెజ్లర్లను ఏ మాత్రం మానవత్వం లేకుండా, ఈడ్చుకుంటూ నెట్టుకుంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్న వైనాన్ని ప్రపంచమంతా చూసింది. సర్కార్‌ తీరుపై మండిపడింది.

ప్రజాస్వామ్య దేశంలో మహిళా రెజ్లర్ల దీనావస్థపై దేశం చలించిపోయింది. కానీ బీజేపీ ఐటీ సెల్‌ మాత్రం వారిని బద్నాం చేయడానికి కంకణం కట్టుకుంది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(WFI) చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌కు(Brij Budhan sharan Singh) వ్యతిరేకంగా అగ్రశ్రేణి రెజ్లర్లు నెలరోజులకు పైగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌(Jantar Mantar) దగ్గర నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే! బీజేపీ అగ్రనాయకులకు మాత్రం ఈ విషయం తెలియదు. అందుకే బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్య చేపట్టలేదు.

రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళ్తుండగా ఢిల్లీ పోలీసులు దాష్టికాన్ని ప్రదర్శించారు. వారిని ఈడ్చుకెళుతూ అదుపులోకి తీసుకున్నారు. సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్(Vinesh Phogat) భజరంగ్‌ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించారు. వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రెజ్లర్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని బస్సుల్లో ఎక్కించి వేర్వేరు ప్రాంతాలకు తరలించారు.

అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఫొటోల్లో వినేశ్‌ ఫోగట్‌, సంగీత ఫోగట్‌(Sangeetha Phogat) పోలీసు వ్యాన్‌లో కూర్చుని నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఉంది. నిజానికి వీరు నవ్వలేదు. దీనంగా మొహం పెట్టుకుని ఉన్నారు. ఎక్కడ తమకు అప్రతిష్ట కలుగుతుందోనన్న భయంతో బీజేపీ పెయిడ్‌ ముఠా వారి ఫోటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. వాట్సప్‌ యూనివర్సిటీ స్టూడెంట్లు దాన్ని వైరల్‌ చేస్తూ వికృతానందం పొందారు. ఈ ఫోటోలపై రెజ్లర్లు కూడా స్పందించారు. తమ ఫొటోలను కొందరు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని ఆరోపించారు.

కొందరు వ్యక్తులు ఈ తప్పుడు చిత్రాన్ని ప్రచారం చేస్తున్నారని, ఈ నకిలీ ఫొటోను పోస్ట్‌ చేసిన వారిపై ఫిర్యాదు చేస్తామని భజరంగ్‌ పునియా అన్నారు. సాక్షి మలిక్‌ కూడా ఈ దుర్మార్గపు చర్యపై స్పందిచారు. ఆ ఫొటోలన్నీ మార్ఫింగ్ అని, ఇలాంటి చీప్ ట్రిక్స్ తో తమను కించపరచాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్‌ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావట్లేదు. మాకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు.

Updated On 29 May 2023 5:45 AM GMT
Ehatv

Ehatv

Next Story