సార్వత్రిక ఎన్నికల(General elections) ఎంతో దూరంలో లేవు. మరో పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) ఎన్నికల షెడ్యూల్ను(Election schedule) విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. వ్యూహ ప్రతివ్యూహలలో నిమగ్నమయ్యాయి. పొత్తుల కుదుర్చుకుంటున్నాయి.

Akshay Kumar
సార్వత్రిక ఎన్నికల(General elections) ఎంతో దూరంలో లేవు. మరో పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) ఎన్నికల షెడ్యూల్ను(Election schedule) విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. వ్యూహ ప్రతివ్యూహలలో నిమగ్నమయ్యాయి. పొత్తుల కుదుర్చుకుంటున్నాయి. ప్రచారాన్ని కూడా మొదలు పెట్టాయి. ఢిల్లీలో(Delhi) ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) , కాంగ్రెస్(Congress) మధ్య పొత్తు కుదిరింది. ఢిల్లీలో ఉన్న మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలలో ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు చోట్ల, కాంగ్రెస్ మూడింట బరిలో దిగబోతుంది. గత ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న ఏడింటికి ఏడు స్థానాలను బీజేపీ(BJP) గెల్చుకుంది. ఈసారి బీజేపీ జోరుకు బ్రేక్ వేయాలని ఇండియా కూటమి(INDIA alliance) భావిస్తోంది. ఇండియా కూటమికి గట్టి పోటీ ఇవ్వడానికి బీజేపీ అభ్యర్థల ఎంపికపై దృష్టి పెట్టింది. చాందినీ చౌక్(Chandni Chowk) నుంచి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ను(Akshay Kumar) బరిలో దించాలన్నది బీజేపీ అధినాయకత్వం ప్లాన్. నరేంద్రమోదీకి అక్షయ్ కుమార్ పరమభక్తుడన్న విషయాన్ని చెప్పాల్సిన పని లేదు. ఈ విషయమై ఇప్పటికే బీజేపీ నేతలు అక్షయ్‌ను సంప్రదించారట! అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
